Advertisementt

పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్ తో ఇండస్ట్రీ మైమరిచింది!

Thu 24th Dec 2020 05:38 PM
pawan kalyan,gifts,christmas,mahesh,rana,nithiin,bandla  పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్ తో ఇండస్ట్రీ మైమరిచింది!
Pawan mesmerizes the industry with Christmas Gifts! పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్ తో ఇండస్ట్రీ మైమరిచింది!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యణ్ హిందువే అయినా.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా క్రిష్టియన్. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిస్మస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ దగ్గరనుండి మహేష్ వరకు పిల్లల కోసం క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటే.. సమంత మాత్రం క్రిస్మస్ ని బాగా సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మూడో భార్య కోసం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టాడు. అంతేనా ఇప్పుడు ఇండస్ట్రీ లో ప్రముఖులకు, తనకు దగ్గర స్నేహితులకి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపిస్తున్నాడు. మహేష్ దగ్గర మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రానా, నితిన్, బండ్ల గణేష్ లతో సహా మరికొంతమంది సన్నిహితులకు ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించాడు.

మరి ఈ గిఫ్ట్స్ అందుకున్న నమ్రత మహేష్ నూతన దంపతులైన పవన్, అన్నాకి మంచి జరగాలని కోరుకుంటే.. బండ్ల గణేష్ అయితే మీ ప్రేమకు నేనెప్పుడూ బానిస నే బాస్ నువ్వే నా దేవుడివి అంటూ ట్వీట్ చేసాడు. ఇక నితిన్ అయితే థాంక్స్ అన్నా అంటే.. రానా మీ ప్రేమకి, అభిమానానికి ధన్యవాదాలు అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. మరి గతంలోనూ పవన్ కళ్యాణ్ తన మామిడి తోటలో కాచిన కాయలు నితిన్ వంటి సన్నిహితులుకి పంపినట్లుగానే.. ఇప్పుడు క్రిస్మస్ కానుకలు పంపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు..

Pawan mesmerizes the industry with Christmas Gifts!:

Pawan Kalyan gifts the industry this Christmas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ