Advertisementt

పెళ్లిపై క్లారిటీ వచ్చినట్టేనా?

Thu 24th Dec 2020 09:03 PM
ranbir kapoor,marrying,alia bhatt  పెళ్లిపై క్లారిటీ వచ్చినట్టేనా?
Is there a Clarity on the wedding? పెళ్లిపై క్లారిటీ వచ్చినట్టేనా?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక్కొక్కళ్ళుగా పెళ్లి చేసుకుని జంటలుగా మారుతున్నా అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కపూర్ కానీ పెళ్లి విషయంలో క్లారిటీ లేకుండా జంట పక్షుల్లా వెకేషన్స్ ని మాత్రమే కాకుండా ఏ సందు దొరికినా వదలకుండా ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్ కపూర్ - అలియా భట్ ల పెళ్లిపై అదిగో ఇదిగో అంటూ మీడియా లో వార్తలు రావడమే కానీ.. ఈ జంట మాత్రం పెళ్లిపై స్పందించదు. కానీ తాజాగా రణబీర్ కపూర్ అలియాతో పెళ్లిపై ఇచ్చి ఇవ్వని స్పష్టతనిచ్చాడు. అంటే త్వరలోనే తమ పెళ్లి జరగాలంటూ ఆస్తిస్తున్నట్టుగా చెప్పాడు రణబీర్ కపూర్.. ఓ ఇంటర్వ్యూ లో రణబీర్ కపూర్ మాట్లాడుతూ కరోనా లేకపోతె ఈపాటికే తాము పెళ్లితో ఒక్కటయ్యేవాళ్లమంటూ చెప్పడంతో.. త్వరలోనే రణబీర్ కపూర్ - అలియా భట్ లు పెళ్లి పీటలెక్కడం ఖాయమని అభిమానులు డిసైడ్ అయ్యారు.

ఇక పెళ్లిపై అంత కన్నా ఇంకేం చెప్పలేనని.. కాకపోతే త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్టుగా చెప్పిన రణబీర్ ని చూస్తే అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్లి పక్కా అని తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రేమ పక్షుల్లా చూసిన వారు పెళ్లికి చేసుకోవచ్చుకదా అంటుంటారు. ఇక అలియా భట్ - రణబీర్ కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క అలియా భట్ పాన్ ఇండియా మూవీ RRR సీతగా నటించబోతుంది. ఇప్పటికే అలియా భట్ RRR సెట్స్ లో జాయిన్ కూడా అయ్యింది. అయితే అలియా భట్ లాక్ డౌన్ లో కొత్త విషయాలను నేర్చుకోవడంలోనిమగ్నమై..  గిటార్ మొద‌లు స్క్రీన్ రైటింగ్ వ‌ర‌కు చాలా ఆన్ లైన్ క్లాస్ లు తీసుకుందట. ఈ విషయాన్నీ అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ బయటపెట్టాడు. 

Is there a Clarity on the wedding?:

Ranbir kapoor opens up on marrying Alia bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ