RX 100 హిట్ కొట్టిన అజయ్ భూపతికి రెండో సినిమాకి హీరోలే సెట్ కాలేదు. మహాసముద్రం స్క్రిప్ట్ తో కలవని హీరో లేడు. రవితేజ, నాగ చైతన్య లు ఓకె చెప్పినట్టే చెప్పి అజయ్ ని లైట్ తీసుకున్నారు. చివరికి శర్వానంద్ తో కమిట్ చేయించుకున్న అజయ్ భూపతి.. మహాసముద్రం కోసం మరో హీరో సిద్దార్డ్ తీసుకొచ్చాడు. చాలామంది హీరోలు రిజెక్ట్ చేసిన మహాసముద్రం స్క్రిప్ట్ ని శర్వానంద్ ఒప్పుకోవడంతో.. ఆ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే ఈ సినిమాకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో.. ఎందుకంటే క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ని కాకుండా ఈ సినిమాలోకి ప్లాప్ హీరోయిన్స్ ని తీసుకున్నాడు అజయ్ భూపతి. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న అతిథిరావు హైదరి, అను ఇమ్మానియేల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
వీరిద్దరూ ప్లాప్ హీరోయిన్స్ ని తీసుకున్నాడు ఓకె.. బడ్జెట్ ప్రోబ్లెంస్ లాంటివి ఏం లేకపోతె, ఐటెం గర్ల్ ని కూడా ఎటువంటి ఫేమ్ లేని హీరోయిన్ నే ఎందుకు తీసుకుంటాడు. మహాసముద్రంలో ఐటెం సాంగ్ కోసం అజయ్ భూపతి ఓ ప్లాప్ భామని తీసుకోబోతున్నాడట. ఆమె మన్నారా చోప్రా. బాలీవుడ్ భామ మన్నారా చోప్రా కి హీరోయిన్ గా ఎలాంటి ఇమేజ్ లేకపోయినా.. ఇండస్ట్రీలో ఏదో ఒక ఈవెంట్ లో తళుక్కున మెరుస్తూనే ఉంటుంది. తాజాగా అజయ్ భూపతి మహాసముద్రం ఐటెం సాంగ్ కోసం మన్నారా చోప్రాని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి హీరోయిన్ గానే కాదు.. ఐటెం సాంగ్ కోసం కూడా అజయ్ భూపతి ప్లాప్ భామనే ఎంపిక చేసాడంటే మహాసముద్రానికి బడ్జెట్ ప్రోబ్లెంస్ ఉండే ఉంటాయి. అందుకే అజయ్ ఇలా క్రేజ్ లేని హీరోయిన్స్ తో అడ్జెస్ట్ అవుతున్నాడంటున్నారు.