Advertisementt

బ్రేకింగ్: పార్టీ పెట్టకుండా ప్యాకప్ చెప్పేసారు!

Tue 29th Dec 2020 12:15 PM
superstar rajinikanth,politics,movies  బ్రేకింగ్: పార్టీ పెట్టకుండా ప్యాకప్ చెప్పేసారు!
BREAKING: Rajinikanth announces that he won't be entering politics బ్రేకింగ్: పార్టీ పెట్టకుండా ప్యాకప్ చెప్పేసారు!
Advertisement
Ads by CJ

తమిళనాట రాజకీయాలతో కొత్త ఒరవడి సృష్టిస్తానంటూ ఊరించిన రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రకటన చేసి అభిమానులను సంతోష పెట్టారు. మరో వారంలోనే రజినీకాంత్ రాజకీయ పార్టీ పేరు, గుర్తు బయటికి రానున్న తరుణంలో రజినీకాంత్ రాజాకీయాలకు బై బై చెప్పేసారు. కొన్నేళ్లుగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై హడావిడి చెయ్యడమే కానీ రజినీకాంత్  మాత్రం స్పష్టతనివ్వకుండా  కాలం గడిపేశారు. తాజాగా రాజకీయ అరంగేట్రం గురించి పబ్లిక్ అనౌన్సమెంట్ చేసి.. త్వరలోనే పార్టీ పెట్టబోతున్నామంటూ ప్రకటించడం అంతలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అభిమానులను నిరాశలో నింపేసాయి.

కానీ రాజకీయాల్లోకి రానంటూ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదు. ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా రజినీకాంత్ ఫ్యామిలీ మెంబెర్స్ ముఖ్యంగా ఆయన కూతుళ్లు రజినీకాంత్ తో ఈ రాజకీయాలు మనకొద్దు నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో రజినీకాంత్ అలోచించి రాజకీయాలకు ప్యాకప్ చెప్పేసారు. తాను రాజకీయాలా నుండి విరమించుకుంటున్నట్లుగా అధికారిక ప్రకటన చేసారు. తాజాగా రజినీకాంత్ హై బిపితో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవడంతో ఆయన ఫ్యామిలీ అందోళనకు గురైంది. అలాగే రాజకీయ ప్రవేశానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని రజిని తాను ఒప్పుకున్న సినిమా కోసం 14 గంటల పాటు శ్రమించడం కూడా రజిని అనారోగ్యానికి కారణమైంది.

అందుకే ఇన్ని తలనొప్పులు మధ్యన రాజకీయ పార్టీ పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోవడమెందుకు అని ఫ్యామిలీ మెంబెర్స్ ఆందోళన చెందడంతో రజినీకాంత్ రాజకీయాల మాట విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రజిని రాజకీయాల్లోకి రాబోవడం లేదనే రజిని ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

BREAKING: Rajinikanth announces that he won't be entering politics:

SuperStar Rajinikanth announces that he won't be entering politics.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ