బాలీవుడ్ నుండి ఐటెం సాంగ్ కోసం టాప్ రేంజ్ హీరోయిన్ కావాలంటే కోట్లు సమర్పించాల్సిందే. మరి తెలుగు హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తే.. హిందీలో క్రేజ్ కోసం అక్కడ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం కన్నా ఐటెం సాంగ్స్ కోసం హీరోయిన్స్ ని తెచ్చుకోవడమే బెటర్ అంటూ.. అక్కడ టాప్ రేంజ్ హీరోయిన్స్ ని ఐటెం సాంగ్స్ కోసం సంప్రదిస్తున్నారు. కానీ వాళ్ళ రేంజ్ ని బట్టి వాళ్ళు కోట్లు కావాలంటున్నారు. అందుకు ఓకె అంటే.. సరే లేదంటే మరొకర్ని వెతుక్కోవాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప కి అదే సీన్ కనబడింది. పాన్ ఇండియా మూవీ పుష్ప కి హీరోయిన్ గా సౌత్ గర్ల్ ని ఎంచుకున్న సుకుమార్ ఐటెం కోసం బాలీవుడ్ భామలని కెలికాడు. ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న దిశా పటాని ని పుష్ప ఐటెం కోసం సంప్రదించగా.. ఆమె అడిగిన పారితోషకానికి షాక్ అయ్యారట సుకుమార్ వాళ్ళు.
ప్రస్తుతం హాట్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న దిశా పటాని పుష్ప లో ఐటెం చెయ్యాలంటే కోటిన్నర కావాలి అందట. దానితో షాకయినా అల్లు అర్జున్ టీం.. ఐటెం కి అంతా.. అయితే వద్దులెమ్మా అన్నారట. ఇక దిశా ఇచ్చిన షాక్ తో సుకుమార్ వాళ్ళు మరో హాట్ గర్ల్ ఊర్వశి రౌతెల్లని సంప్రదించడం ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో పుష్పకి ఐటెం గర్ల్ కష్టలు తీరిపోయాయట. మరి దిశా పటానికి కోటిన్నర ఇచ్చేకన్నా.. గ్లామర్ గర్ల్ ఉర్వశికి కోటి ఇచ్చిన దండగ లేదని పుష్ప టీం ఫిక్స్ అయ్యిందట. అలా దిశా పటాని పుష్పకి షాకిస్తే.. పుష్ప టీం దిశాకి షాకిచ్చిందట.