Advertisementt

ఐదేళ్ల తర్వాత కలుస్తున్న జంట

Sat 02nd Jan 2021 05:44 PM
star maa sankranthi special ravi lasya  ఐదేళ్ల తర్వాత కలుస్తున్న జంట
The couple meeting five years later ఐదేళ్ల తర్వాత కలుస్తున్న జంట
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద ఢీ షో తో బాగా పాపులర్ అవడమే కాదు యాంకర్స్ రవి - లాస్య జంట హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకుంది. రవి - లాస్య ల చిలిపి అల్లరి పోట్లాటలు బుల్లితెర మీద పలు షోస్ కి భారీ రేటింగ్స్ తెచ్చిపెట్టేయి. ఢీ డాన్స్ షో లో రవి - లాస్య టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకోవడం, వాళ్ళ అల్లరితో ఢీ డాన్స్ షో కి బాగా క్రేజ్ వచ్చింది. అయితే ఉన్నట్టుండి లాస్య - రవి విడిపోయి రవి సపరేట్ గా షోస్ కి యాంకరింగ్ చెయ్యడం, లాస్య.. మంజునాధ్ ని వివాహం చేసుకుని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు.. మధ్య మధ్యలో రవి పేరు తియ్యకుండా ఇండైరెక్ట్ గా రవి గురించి అనుమానాలు తలెత్తేలా లాస్య మాట్లాడడం.. కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి రవి తన ఫ్యామిలీని బుల్లితెరకు పరిచయం చెయ్యడంతో.. రవి - లాస్య ల మధ్యన అంతా ముగిసిపోయింది. వాళ్ళ మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. 

ఐదేళ్లుగా రవి మీద లాస్య, లాస్య మీద రవి చెప్పడం తప్ప వారు కలిసిన సందర్భాలు లేవు. ఐదేళ్లుగా విడిపోయిన ఈ రవి లాస్య ల జంట మళ్ళీ కలవబోతుంది. దానికి స్టార్ మా వేదిక కాబోతుంది. ఈ సంక్రాంతికి స్టార్ మాలో ప్రసారం కాబోయే ఓ స్పెషల్ షో లో రవి - లాస్య కలవబోతున్నారు. ఇప్పటికే వదిలిన ప్రోమోలో రవి లాస్య దగ్గరకి వచ్చి నా వలన నువ్వు బాధపడి ఉంటే క్షమించమని అడిగి లాస్య కి హాగ్ ఇవ్వడం, లాస్య రవికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టడంతో వారి మధ్యన సమస్య ముగిసిపోయినట్టే కనబడుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ కలిసి సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాంలో సందడి చేసారు. మరి ఆ షో లో అన్నిటికన్నా ఐదేళ్ల తర్వాత కలవబోయే రవి - లాస్య ల మీదే అందరి చూపు ఉండేలా కనబడుతుంది.

The couple meeting five years later:

Star maa Sankranthi special programme

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ