Advertisementt

బొమ్మ అదిరింది - జీ బెదిరింది

Sat 02nd Jan 2021 07:23 PM
bomma adirindi zee telugu  బొమ్మ అదిరింది - జీ బెదిరింది
Bomma Adirindi- Zee threatened బొమ్మ అదిరింది - జీ బెదిరింది
Advertisement
Ads by CJ

నాగబాబు జబర్దస్త్ లో పని చేసే నితిన్ - భరత్ ల కోసం అన్నం పెట్టిన జబర్దస్త్ లో దుకాణం సర్దేసి.. జీ తెలుగులో మకాం పెట్టాడు. వెళ్ళేవాడు ఊరికే వెళ్ళాడా తనతో పాటుగా చమ్మక్ చంద్ర లాంటి టాప్ కమెడియన్స్ ని తీసుకుపోయాడు. నాగబాబు ఆధ్వర్యంలోనే అదిరింది కామెడీ షో ప్లాన్ చేసింది జీ తెలుగు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా అదిరింది మాత్రం జబర్దస్త్ ని కొట్టలేకపోయింది. నాగబాబు లేకపోయినా జబర్దస్త్ షో తొణకలేదు, బెణకలేదు. కానీ నాగబాబు కి ఇప్పుడు జబర్ధస్త్ వదిలి ఎంత తప్పు చేసానో అనిపించకమానదు. ఎందుకంటే అదిరింది షో అదరడం లేదంటూ బొమ్మ అదిరింది అంటూ కొత్తగా అదిరిందిని ప్రమోట్ చేసారు. అలాగే అదిరింది అదరడం లేదంటూ యాంకర్ సమీరని తప్పించి రవి -  భాను లని తెచ్చారు. మళ్ళీ బొమ్మ అదిరిందికి శ్రీముఖి యాంకర్. 

బొమ్మ అదిరింది రెండు మూడు ఎపిసోడ్స్ బాగానే అదరగొట్టింది. కానీ ఇప్పుడు బొమ్మ అదిరింది కి జీ బెదరడంతో షో ఆపేసినట్లుగా తెలుస్తుంది. నాగబాబు భవిష్యత్తు ముందే ఆలోచించుకుని యూట్యూబ్ లో హడావిడి మొదలెట్టాడు. కానీ నాగబాబు ని నమ్ముకుని జబర్ధస్త్ ని వదిలి వచ్చిన చంద్ర, ఆర్పీ, వేణు, ధనరాజ్ లాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా కనబడుతుంది. బొమ్మ అదిరింది ఆగిపోయిందా? ఆపేశారా? తెలియదు కానీ రెండు వారాలుగా బొమ్మ అదిరింది ప్రోమోస్ లేవు, గత వారం షో లేదు. దీన్నిబట్టి బొమ్మ అదిరింది కూడా దుకాణం సర్దేసినట్లుగానే కనబడుతుంది.

Bomma Adirindi- Zee threatened:

Did Bomma Adirindi stop? Or got stopped?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ