ఇలానే ఉంది బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పరిస్థితి. బిగ్ బాస్ లో సందడి చేసి, కామెడీ చేసి, గొడవలు పడి అమ్మాయిలతో లవ్ ట్రాక్ లు నడిపిన వాళ్ళకి బయట వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్నో ఏళ్లగా కామెడీ షో జబర్దస్త్ ని నమ్ముకున్న అవినాష్ భారీ పారితోషకం అనగానే రెండేళ్ల అగ్రిమెంట్ కి 10 లక్షలు కట్టి మరీ బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేసాడు. తర్వాత వెండితెర అవకాశాల మీది ఫోకస్ పెట్టాడు. బిగ్ బాస్ లో జబర్దస్త్ కన్నా ఎక్కువ పారితోషకమే ఇచ్చారు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఓ ఏడాది పాటు ఏ ఛానల్ కి వెళ్లి షోస్ చేసుకోకూడదు. కేవలం వెండితెర లేదంటే స్టార్ మా అంతే ఛాన్స్.
సోహెల్ కి సినిమా ఛాన్స్ వచ్చేసింది. మోనాల్ కి స్టార్ మా గ్లామర్ ఛాన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తుంది. ఇక మిగత అఖిల్ కానీ, అవినాష్ కానీ ఇప్పటికిప్పుడు ఎవరూ వెండితెర ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని ఇతర ఛానల్ కి వెళ్ళలేరు. మధ్యలో స్టార్ మా పిలిచి పనిస్తేనే తప్ప వాళ్ళకి మరో అవకాశం లేదు. అదే అవినాష్ ఇప్పుడు ఫీలవుతున్నాడు. జబర్దస్త్ కి మళ్ళీ పిలిస్తే వెళ్తా అంటున్నాడు. కానీ దానికి కూడా ఏడాది పడుతుంది. మరోపక్క రన్నర్ అఖిల్ కి క్రేజ్ అయితే వచ్చింది కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మరోపక్క అభిజిత్ హీరోగా ట్రై చేసుకోవడానికి ఫోటో షూట్స్ అంటూ బిజీగా ఉన్నాడు. మోనాల్ వెండితెర మీద, స్టార్ మాలో దున్నేస్తుంది. మరి అఖిల్, అవినాష్ లాంటివాళ్ళకి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది పరిస్థితి.