'యానిమల్' ప్రస్తుతం మీడియాలో ట్రేండింగ్ అవుతున్న సినిమా టైటిల్ ? అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు సందీప్ వంగ తెరెకెక్కించే తదుపరి సినిమా. అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేమికుడిని కొత్త కోణంలో పరిచయం చేసి.. ఇది కదా రియల్ అనేలా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించేలా చేసిన ఈ సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఇతర భాషలోని ప్రముఖ మేకర్స్ అందరు ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడ్డారు. తమిళంలో ఆదిత్య వర్మ గా సంచలనం క్రియేట్ చేస్తే హిందీలో కబీర్ సింగ్ గా దుమ్ము రేపింది. ఈ సినిమా విజయానికి ఇంపాక్ట్ అయిన మహేష్ బాబు ఈ క్రేజీ దర్శకుడితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. కానీ సందీప్ వంగ చెప్పిన కథ విని షాక్ అయ్యాడో ఏమో.. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదు.. ఈ గ్యాప్ లో మరో సినిమాతో బిజీ అయ్యాడు మహేష్.
అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న న్యూస్ ఏమిటంటే .. సందీప్ వంగ మన సూపర్ స్టార్ మహెష్ కి చెప్పిన కథ ఇదేనని ? పైగా టైటిల్ కూడా చాలా బిన్నంగా ఉంది .. బహుశా ఈ టైటిల్ వినే మహేష్ నో చెప్పి ఉంటాడేమో ? ఏది ఏమైనా మహేష్ బాబు కు నచ్చని కథ బాలీవుడ్ వాళ్లకు నచ్చింది.. అందుకే ఈ యానిమల్ బాలీవుడ్ తెరపై రావడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే టైటిల్ టీజర్ లో తండ్రి కొడుకుల అనుబంధం అన్న కనెక్షన్ కనిపిస్తుంది .. !! మరి రణబీర్ కపూర్ లోని ఉన్న యానిమల్ ని బయటికి తీస్తాడో, లేక తనలో ఉన్న యానిమల్ ని బయటికి తీస్తాడో మన దర్శకుడు సందీప్ వంగ !! ఏది ఏమైనా టైటిల్ అనౌన్సుమెంట్ తో షాకిచ్చిన సందీప్ వంగ మరో సంచలన చిత్రానికి తెర తీస్తున్నట్టే !!