Advertisementt

ఎక్స్‌క్లూజివ్‌: రానా - వెంకటేష్ సినిమా కన్ఫర్మ్

Mon 04th Jan 2021 03:55 PM
rana venkatesh maha cinema confirm  ఎక్స్‌క్లూజివ్‌: రానా - వెంకటేష్ సినిమా కన్ఫర్మ్
Exclusive: Rana - Venkatesh Cinema Confirm ఎక్స్‌క్లూజివ్‌: రానా - వెంకటేష్ సినిమా కన్ఫర్మ్
Advertisement
Ads by CJ

వెంకటేష్ - రానా మూవీ అనగానే విక్టరీ వెంకటేష్ - దగ్గుబాటి రానా కాంబినేషన్ మూవీ అనుకుంటారు. కానీ ఆ స్పెషల్ కాంబో మూవీకి, స్పెషల్ క్రేజీ న్యూస్ కి ఇంకాస్త టైం ఉంది. వెంకటేష్ తో రానా అంటే వెంకటేష్ మహా తో రానా మూవీ ఫిక్స్ అయ్యింది. రానా తన తదుపరి సినిమాని దర్శకుడు వెంకటేష్ మహాతోనే చెయ్యబోతున్నాడు. కేరాఫ్ కంచర పాలెం సినిమాతో దగ్గుబాటు కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన వెంకటేష్ మహా కి ఆ సినిమాతో మంచి పేరు రావడమే కాదు.. తర్వాత సత్య దేవ్ హీరోగా గా తెరకెక్కించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా వెంకటేష్ మహాకి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తన హ్యాట్రిక్ ఫిలిం ని దర్శకుడు వెంకటేష్ మహా దగ్గుబాటి రానాతో చెయ్యబోతున్నాడు. 

ఇప్పటికే  రానాకీ సురేష్ బాబు కి తన స్క్రిప్ట్ వినిపించి సినిమా ఓకే చేయించుకున్న వెంకటేష్ మహా త్వరలోనే రానాతో తన మూడో సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. రానా ఇమ్మిడియట్ గా పవన్ కళ్యాణ్ తో అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయ్యప్పమ్ కోషియమ్ సినిమా కి తక్కువ డేట్స్ కాబట్టి.. పవన్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ని 30 రోజుల్లో ఫినిష్ చేసుకుని రానా వెంకటేష్ మహా సినిమా కోసం తయారవుతాడు. మార్చి నుండి వెంకటేష్ మహా - రానా కొత్త మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది.

Exclusive: Rana - Venkatesh Cinema Confirm:

Exclusive: Rana - Venkatesh Cinema Confirm

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ