Advertisementt

సమంతని ఆటాడుకున్న చైతన్య

Thu 21st Jan 2021 12:43 PM
samantha sam jam aha talk show naga chaitanya  సమంతని ఆటాడుకున్న చైతన్య
Chaitanya play with Samantha సమంతని ఆటాడుకున్న చైతన్య
Advertisement
Ads by CJ

అక్కినేని సమంత సామ్ జామ్ షో అంటూ ఆహా ఓటిటి టాక్ షోలో తన టాలెంట్ ని చూపిస్తూ వచ్చిన గెస్ట్ లకి రకరకాల ప్రశ్నలు వేస్తూ విచిత్రమైన ఎక్సప్రెషన్స్ తో ఆటాడుకుంటుంది. చిరంజీవి, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్, సైనా నెహ్వాల్ లాంటి సెలెబ్రేటిస్ ఆహా సామ్ జామ్ షోకి వచ్చారు. ఈమధ్యన అల్లు అర్జున్ సామ్ జామ్ ప్రోమో ఒకటి కాట్రవర్సీ కూడా అయ్యింది. అయితే ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చాక ఇంట్లోనే పడి ఉంటున్నా కదా అని ఎప్పుడైనా వస్తాడులే అని ఇప్పటికీ ఈ షో కోసం పిలిచావా సామ్ అంటున్నాడు చైతన్య. సామ్ జామ్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం నాగ చైతన్య ని గెస్ట్ గా ఆహ్వానించింది సమంత. ఇక ఒకే స్టేజ్ మీద భార్య భర్తలని చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్టుగా ఉంది ఈ జంట.

మరి భార్య భర్తల మధ్యన ఈ టాక్ షో ఎంతటి ఆసక్తికరంగా ఉండబోతుందో జస్ట్ ఓ ప్రోమో వదిలింది ఆహా టీం. భర్త చెయ్యి పట్టుకుని నవ్వుతూ స్టేజ్ మీదకొచ్చిన సమంతని చైతూ అడుగడుగునా ఆడేసుకున్నాడు. ఫైనల్లీ నువ్వు సామ్ జామ్ షోలో అంటూ సమంత మొదలు పెట్టగానే.. చైతు అందుకుని వీడు ఇంట్లోనే పడి ఉంటాడు కదా.. ఎప్పుడైనా వస్తాడు, ఏ షోకైనా వస్తాడు అని లాస్ట్ లో నన్ను పిలిచావ్ అని సమంతకి షాక్ ఇచ్చాడు. ఇక సమంత ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తావ్ చై అని అడగగానే.. నేను ఇప్పుడు అడ్వైజ్ ఇస్తే నువ్వు తీసుకుంటావా.. ఎందుకంటే ఇంట్లో ఏ అడ్వైజ్ ఇచ్చినా తీసుకోవ్ కదా అంటూ సామ్ జామ్ షో లో సామ్ పరువు తీసేసాడు చై.

నా హస్బెండ్ చాలా మంచి మూడ్ లో ఉన్నాడు అనగానే చై కూడా నేనెప్పుడూ గుడ్ మూడ్ లోనే ఉంటాను అన్నాడు. ఇక నా కుకింగ్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారని సామ్ అడగగా.. కుకింగ్ కా.. వాట్ అంటూ చైతూ పెట్టిన ఎక్సప్రెషన్ చూస్తే సమంత వంట ఎంత దారుణంగా ఉంటుందో చెప్పెయ్యొచ్చు. ఇక నాగ చైతన్య నేను కాలేజ్ కి వెళ్లి లాస్ట్ బెంచ్ లో అయినా కూర్చున్నా.. కానీ నువ్వసలు కాలేజ్ కి అయినా వెళ్ళావా.. నీకెందుకు అన్ని పోస్ట్ చెయ్యాలనిపిస్తుంది అనగానే దానికి సామ్ ఇప్పుడు నేను హోస్ట్ ని అంటే దానికి చై సామ్ జామ్ కదా షో పేరు.. సో జామ్ విత్ సామ్ అంటూ.. నీ షోలో గెస్ట్ ని నువ్వు రాగ్ చెయ్యలేవు. ఎందుకంటే ఈ షోలో ఈ గెస్ట్ కి నీ గురించి అంతా తెలుసు అంటూ సమంత ని ఓ రేంజ్ లో ఆటాడుకున్నాడు చైతన్య. మరి ఈ భార్యాభర్తల అల్లరి ప్రోమో సోషల్ మీడియా లో వైరాలవుతుంది.

Chaitanya play with Samantha:

Samantha Sam Jam With Naga Chaitanya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ