అల్లరి నరేష్ హీరోయిన్ గా ఐరెన్ లెగ్ గా ముద్రపడిన హాట్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బిగ్ బాస్ అనేది ఎవరికి ఎంత హెల్ప్ చేసిందో తెలియదు కానీ మోనాల్ కి మళ్ళీ పునర్జన్మనిచ్చింది. టాలీవుడ్ లో నెగ్గలేక బిచాణా ఎత్తేసిన ఈ హాట్ బ్యూటీకి మళ్ళీ టాలీవుడ్ రా..రమ్మంటుంది. ప్రస్తుతం తెలుగులో మోనాల్ గజ్జర్ అందాలకు బాగా గిరాకీ ఉంది. అందుకే అమ్మడు ఆ అవకాశాలను మారుమాట్లాడకుండా క్యాష్ చేసుకునే పనిలో బిజీగా మారింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక హీరోయిన్ అవకాశాలే కావాలని పట్టుబట్టకుండా.. వచ్చిన వాటితో సర్దుకుపోతూ ఏ కంటెస్టెంట్ లేని విధంగా మోనాల్ బిజీగా మారింది.
బిగ్ బాస్ లో గుజరాతీ అమ్మాయిగా అడుగుపెట్టినా బుల్లితెర ప్రేక్షకులు మాత్రం, మోనాల్ అందాలకు పడిపోయారు. బిగ్ బాస్ అయితే మోనాల్ అందాలను క్యాష్ చేసుకుంది. అందుకే అడుగడుగునా మోనాల్ ని కాపాడుకుని దత్త పుత్రికని చేసుకుంది. కేవలం గ్లామర్, అఖిల్ తో హగ్గులు, ముద్దులతోనే మోనాల్ 14 వారలు బిగ్ బాస్ లో ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ క్రేజ్ తో అటు వెండితెర మీద, ఇటు బుల్లితెర మీద బిజీ అయిన మోనాల్ గజ్జర్ కి గుజరాత్ వెళ్లి రావడం ఇబ్బందిగా మారిందట. అందుకే హైదరాబాద్ కి మకాం మార్చేసి.. ఇక్కడో ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యిందట మోనాల్. ఇప్పటికే మోనాల్ బ్రోకర్స్ కి చెప్పి ఇల్లు కొనే పనిలో బిజీగా ఉందని అంటున్నారు.