మహర్షి సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన దివి అంటే బిగ్ బాస్ కి వచ్చేవరకు వరకు ఎవ్వరికి తెలియని అమ్మాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 4 లో దివి అంటే ఎవరో మొదటి వారంలోనే తెలిసింది. అందమైన డ్రెస్సులతో.. నాభి అందాల వడ్డనతో.. అమ్మ రాజశేఖర్ స్నేహంతో బాగానే హైలెట్ అయ్యింది. లాస్య - దివి నామినేషన్స్ ప్రక్రియలో దివి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లాల్సి వచ్చినా నవ్వుతూ నా కెరీర్ ఇప్పుడే మొదలవుతుంది అంటూ చెప్పినట్టుగానే దివి బిగ్ బాస్ తో అవకాశాల జోరులో తడిచి ముద్దవుతుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక హాట్ ఫోటో షూట్స్ తో బాగా వైరల్ అయిన దివి చేతిలో బోలెడన్ని అవకాశాలు అంటూ ప్రచారం జరిగినా.. బిగ్ బాస్ స్టేజ్ మీద మెగాస్టార్ చిరు వేదాళంలో ఓ పోలీస్ పాత్రకి దివిని ప్రిఫర్ చెయ్యడం దివికి మరిచిపోలేని అనుభూతితి.
అలా మెగాస్టార్ చిరు సినిమాలో కనిపించనున్న దివికి ఇప్పుడు మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ తన సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నాడట. రానా - పవన్ కాంబోలో తెరకెక్కబోతున్న అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో దివి ని తీసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే పవన్ సినిమాలో దివి ఓ కీలక పాత్రలోనే కనిపించబోతుందట. పవన్ సినిమాలో దివి ని రికమెండ్ చేసింది మాత్రం మెగాస్టార్ చిరునే అంటున్నారు. ఎందుకంటే వేదాళం లో పోలీస్ పాత్ర ఇచ్చి ఊరుకోనని.. దివికి మరిన్ని ఆఫర్స్ ఇస్తానని చిరు బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పినట్టుగా తమ్ముడు పవన్ సినిమాలో దివిని పెట్టుకోమని రికమెండ్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.