నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన మాళవిక శర్మ మాస్ మాహారాజ్ రవితేజ సినిమాకి కావాల్సిన మాసాలని దిట్టంగా దట్టించింది తన స్కిన్ షోతో . అంతేకాదు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లోనూ
మాళవిక క్లివేజ్ షో తో అందరి మతులు పోగొట్టి.. ఆ ఫంక్షన్ లో వేలీడ్ ఎట్రాక్షన్ అయ్యింది. అయితే అల్టిమేట్ గా నేల టికెట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసరికి అమ్మడి గ్లామర్ షో మొత్తం డి మోనిటైజేషన్ తర్వాత దొరికిన 1000 రూపాయల నోటులా వేస్ట్ అయ్యిపోయింది. కానీ బేసిక్ గా లా చదువుకుంటున్న అమ్మాయి కనక ఏ పాయింట్ తో ఎవరిని ఎక్కడ కొట్టాలో తెలిసిన మాళవిక శర్మ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ పిక్స్ ని ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ కిర్రెక్కించే ఫోజులతో కుర్రకారుని కవ్విస్తూ ఆక్టివ్ గానే ఉంటూ వచ్చింది.
ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ రామ్ సినిమా రెడ్ లో ఆఫర్ పట్టింది. కరోనా క్రైసిస్ వలన రిలీజ్ డిలే అయిన రెడ్ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుండడంతో ఉత్సాహంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది మాళవిక శర్మ. అమ్మడి ఆశలన్నీ చాలా గట్టిగానే ఉన్నాయి రెడ్ సినిమా పైన. మరి ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కి నభ నటేష్ కి మంచి బ్రేక్ ఇచ్చిన రామ్.. రెడ్ సినిమా తో మాళవిక శర్మ కెరీర్ ని కూడా మలుపు తిప్పుతాడేమో చూడాలి.