గత ఏడాది ఇదే జనవరి 11 వ తారీఖున అలా వైకుంఠపురములో సినిమా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాల సందడితో సినిమా ఇండస్ట్రీ కళకళ లాడింది. ఈ ఏడాది మీడియం బడ్జెట్ సినిమాలుగా క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాల హడావిడి బాక్సాఫీసు వద్ద కనబడుతుంది. అయితే కరోనా కారణంగా ఏడాది పాటు థియేటర్స్ లో భారీ బడ్జెట్ సినిమాలేవీ విడుదల కాలేదు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ తోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన అలా వైకుంఠపురములో విడుదలై వచ్చే 11వ తారీఖుకి ఏడాది పూర్తవుతుంది. ఈ మధ్యలో ఎన్నో రికార్డులు, ఎన్నెన్నో న్యూస్ లు అలా వైకుంఠపురములో మీద వచ్చాయి. లాక్ డౌన్ పడింది కానీ లేదంటే ఓ పెద్ద ఈవెంట్ పెట్టి అలా వైకుంఠపురములో రికార్డుల గురించి చెప్పేవారు అల్లు వారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న కారణంగా గీత ఆర్ట్స్ ఆఫీస్ లో అలా వైకుంఠపురములో 365 డేస్ సెలెబ్రేషన్స్ చేసే ప్లాన్ లో టీం ఉందని.. అదే పార్టీలో అలా వైకుంఠపురములో కొల్లగొట్టిన యూట్యూబ్ రికార్డులు, అలాగే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ముచ్చట్లని ఓపెన్ చెయ్యబోతుందట టీం. ఈ సెలెబ్రేషన్స్ ని గీత ఆర్ట్స్ ఆఫీస్ లో మూవీ టీం మధ్యన గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసే ఏర్పాట్లలో గీత ఆర్ట్స్ టీం ఉన్నట్లుగా తెలుస్తుంది.