కృష్ణవంశీ సాయి ధరమ్ తేజ్ - సందీప్ కృష్ణ కాంబోలో తెరకెక్కించిన నక్షత్రం సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని రంగమార్తాండ సినిమా చేస్తున్నాడు. అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలో రమ్యకృష్ణ - ప్రకాష్ రాజ్ కాంబోలో మరాఠి మూవీకి రీమేక్ గా రంగమార్తాండ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో 20 రోజుల్లో షూటింగ్ చిత్రీకరణ ముగుస్తోంది అనుకున్న టైములో.. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ ఆగిపోవడానికి కారణం రంగమార్తాండ నిర్మాతేనట. అంటే రంగమార్తాండ నిర్మాత అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువవడంతో.. తాజాగా మొదలైన 20 రోజుల షూటింగ్ కి బడ్జెట్ పెట్టలేనని చేతులెత్తేసినట్టు ఫిలింనగర్ టాక్.
చాలా సన్నివేశాలను కృష్ణవంశీ రీ షూట్స్ చేసిన కారణంగా ముందు అనుకున్న బడ్జెట్ పరిధి దాటిపోవడంతో నిర్మాత ఉన్నట్టుండి ఇప్పుడు చేతులెత్తినట్టుగా చెబుతున్నారు. ఇక ఆ నిర్మాత అర్ధాంతరంగా తప్పుకోవడంతో.. ఇప్పుడు కృష్ణవంశీ మరో నిర్మాతను వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నట్లుగా.. ప్రస్తుతం రంగమార్తాండ షూటింగ్ పై యూనిట్ లోనే కన్ఫ్యూజన్ నెలకొన్నట్లుగా టాక్. కొత్త నిర్మాత దొరికితే మళ్ళీ రంగమార్తాండసినిమా షూటింగ్ యధావిధిగా మొదలవుతుందని.. లేదంటే లేదు అంటున్నారు. మరో 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది అనగా ఇలా బడ్జెట్ అవాంతరాలు రంగమార్తాండ కి రావడం కృష్ణవంశీని టెంక్షన్ లో పెట్టిందని అంటున్నారు.
ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడం వలన సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బావుంటుంది అంటున్నారు. షూటింగ్ కి సంబందించిన అప్ డేట్స్ కానీ, న్యూస్ కానీ యూనిట్ విడుదల చేయకపోవడంతో.. ఇలాంటి వార్తలకు నిజం చేకూరే అవకాశం కూడా లేకపోలేదు..