Advertisementt

బాగా ఇరుక్కుంది.. బయటికి రావడం కష్టమే

Thu 07th Jan 2021 06:30 PM
andhra pradesh,ex-minister,akhila priya,arrested,kidnap case,bhargav ram,praveen kumar,a.v.subbareddy  బాగా ఇరుక్కుంది.. బయటికి రావడం కష్టమే
Bhuma Akhila Priya is well stuck బాగా ఇరుక్కుంది.. బయటికి రావడం కష్టమే
Advertisement
Ads by CJ

భూమా అఖిల్ ప్రియా ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయిన రాజకీయ నాయకురాలు. మాజీ మంత్రి అయిన భూమా అఖిల ప్రియా.. ప్రవీణ్ కుమార్ కిడ్నాప్ కేసులో చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కబెడుతుంది. భర్త భార్గవ్ రామ్ తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్ లో భాగంగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించడంతో తెలంగాణ పోలీస్ లు భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా.. అఖిల్ ప్రియకి 14 రోజుల్ రిమాండ్ విధించింది కోర్ట్. ఈలోపు ఆమె భర్త భర్త రామ్, ఏ వి సుబ్బారెడ్డి.. మరో ముగ్గురు పోలీస్ ల చేతికి దొరక్కుండా పరారీలో  ఉండగా.. స్పెషల్ టీం వాళ్లని వెతికే పనిలో బిజీగా ఉంది. ఎక్కడో కర్నూలులో ఉండాల్సిన అఖిల ప్రియా హైదరాబాద్ లోని ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో భాగంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి  జైల్లో ఊచలు లెక్కబెడుతుంది. అయితే నిన్న ఏ వి సుబ్బారెడ్డిని  ఏ1 నిందుతుడుగా పేర్కొన్న పోలీస్ లు అఖిల ప్రియా రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయటపడడంతో ఇప్పుడు అఖిల ప్రియా బెయిల్ పిటిషన్ విషయం మరింత ఆసక్తికరంగా మరింది.

ఏవి సుబ్బారెడ్డి హఫీజ్ పేట లోని 20 ఎకరాల ల్యాండ్ ని ప్రవీణ్ కుమార్ కి  కొన్ని కోట్లకి అమ్మేస్తే.. ఆ విషయం తెలిసిన అఖిల ప్రియా భర్త తో కలిసి ప్రవీణ్ కుమార్ ని బెదిరించి అది మా నాన్న కొన్న స్థలం అంటూ ప్రవీణ్ కుమార్ ని కిడ్నాప్ చేయించి స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు తీసుకునే క్రమంలో కిడ్నాపర్లు పదే పదే సుబ్బారెడ్డి, అఖిల ప్రియా, భార్గవ్ రామ్ ల పేర్లు తో ఫోన్ చేసి ప్రవీణ్ కుమార్ ని కొట్టినట్లుగా.. పోలీస్ రిమాండ్ లో అఖిల ప్రియా నుండి రాబట్టడంతో ఇప్పుడు ఏ1 ప్లేస్ లో ఉన్న సుబ్బారెడ్డిని ఏ2 కి మార్చి, అఖిల్ ప్రియని ఏ1  నిందితురాలిగా పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఇక అఖిల్ ప్రియా గర్భవతి కావడం, ఆమెకి ఫిట్స్ రావడంతో.. ఆమె తరుపు లాయర్ అఖిలకు బెయిల్ కావాలంటూ కోర్టులో వాదించడంతో పాటుగా ఆమెకి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలంటూ వాదించారు.

అయితే ప్రస్తుతం అఖిల్ ప్రియా కి బెయిల్ వచ్చే సూచనలు లేవని, ఆమె ఇప్పుడు గైనిక్ డాక్టర్ సంరక్షణలో ఉందని పోలీస్ లు చెప్పగా.. ఇప్పుడు అఖిల్ ప్రియా బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో అంటూ అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ కేసులో అఖిల ప్రియకి బెయిల్ రాకపోవచ్చని, భార్గవ్ రామ్, సుబ్బారెడ్డి ఇంకా దొరకలేదని పోలీస్ లు చెబుతున్నమాట.

Bhuma Akhila Priya is well stuck:

Andhra Pradesh ex-Minister Akhila Priya arrested in kidnap case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ