ఇస్మార్ట్ శంకర్ సినిమా అప్పుడు పూరి జగన్నాధ్, ఛార్మి, నభ నటేష్, నిధి అగర్వాల్ లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కానీ రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకుండా వెకేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాకే రామ్ మీడియా ముందుకు వచ్చి ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెగ ప్రమోట్ చేసాడు. రామ్ ఇప్పుడు కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ తాజా చిత్రం రెడ్ ఈ సంక్రాంతి కే విడుదల కాబోతుంది. రామ్ ఎంతో నమ్మి పట్టు బట్టుకుని ఓటిటికి టెంప్ట్ అవ్వకుండా థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలనుకున్న రెడ్ సినిమా మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే రామ్, రెడ్ ప్రమోషన్స్ కి రాకుండా సినిమాలో నటించిన హీరోయిన్స్, దర్శకుడు వచ్చి సినిమా ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ రామ్ ఎక్కడా కనిపించడం లేదు. హీరోయిన్ మాళవిక శర్మ, నివేత పేతురేజ్, దర్శకుడు కిషోర్ తిరుమల లు వరసగా ఇంటర్వూస్ ఇస్తూ రెడ్ ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ రామ్ రెడ్ ట్రైలర్ ఈవెంట్ కి వచ్చాడు. మళ్ళీ ఇంతవరకు మీడియాకి దొరకలేదు. ఇక జీ తెలుగు ఛానల్ లో సంక్రాంతి రోజున ప్రసారం కాబోయే స్పెషల్ ప్రోగ్రాంలో రామ్ కనిపిస్తున్నాడు. అంతేతప్ప రామ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లాంటివి ఇవ్వడం లేదు. అంటే రామ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ అప్పుడు ఫాలో అయిన స్ట్రాటజీనే రెడ్ విషయంలోనూ ఫాలో అవుతున్నాడా? రామ్ అసలు హైదరాబాద్ లోనే ఉన్నాడా? ఒకవేళ రెడ్ హిట్ కొట్టాకే మీడియా ముందుకు వస్తాడా?ఏమో ఏమైనా రామ్ మాత్రం కనీసం రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కయినా వస్తే బావుంటుంది అని ఆయన అభిమానుల కోరిక.