అక్కినేని కోడలుగా నాగ్ ఇంట అడుగుపెట్టిన సమంత తన కెరీర్ ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మార్చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఇప్పటికీ ఫిట్ గా గ్లామర్ గా ఉండే సమంత ఎప్పుడూ ఏదో ఒక వర్కువుట్ కొత్తగానే ట్రై చేస్తుంది. లాక్ డౌన్ లో మిద్దె మీద పంట పండించిన సమంత ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్దగా ఉంటుంది. అంతే కాదు.. సినిమాల ఎంపికలోనూ సమంత అభిరుచి ఎలా ఉంటుందో ఆమె తరుచు కొట్టే హిట్స్ తో అర్ధమవుతుంది. ఆహా టాక్ షో తో సామ్ జామ్ అంటూ రాంగ్ స్టెప్ వేసిన సమంత .. ఇప్పుడు ఆహా టాక్ షో ని ముగించేస్తుంది. ఆహా టాక్ షో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో అనుకున్న దానికన్నా ముందే ప్యాకప్ చెప్పేసింది ఆహా టీం. అయితే సమంత ఆహా టాక్ షో ఆపేసినా.. తమిళనాట విజయ్ సేతుపతి సినిమా తో పాటుగా.. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతుంది.
ఇప్పటికే విల్లులా ఒళ్ళు వంచి వర్కౌట్స్ చేసే సమంత ఈ న్యూ ఇయర్ లోను జిమ్ వర్కౌట్స్, లాన్ వర్కౌట్స్ ని వదల్లేదు. అందులోనూ కొత్తగా ఎనిమల్ ఫ్లో అనే వర్కౌట్లను స్టార్ట్ చేసి ఆ వీడియో ని సోషల్ మీడియాలో వదిలింది. గ్లామర్ గర్ల్ వర్కౌట్ వీడియో క్షణాల్లో వైరల్ అయినట్లుగానే సమంత వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుణశేఖర్ శాకుంతలం సినిమాలో గ్లామర్ గా కనిపిస్తూనే పౌరాణికంగా కూడా సమంత లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది అని టాక్. సమంత లుక్ టెస్ట్ కోసం రెడీ అవుతుంది అని, గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం సెట్స్ నిర్మాణంలలో బిజీగా ఉన్నాడని అంటున్నారు.