ఎన్టీఆర్ ఈ ఏడాది ఫాన్స్ కోసం రెండు ట్రీట్స్ ని సిద్ధం చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. ఈ దసరాకే పాన్ ఇండియా ఫిలిం RRR ని విడుదల చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడనగానే ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆనందం కట్టలు తెచ్చుకుంది. మరో వైపు ఈ సంక్రాంతి రోజున త్రివిక్రమ్ తో కేజీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నాడు. ఇది కూడా ఈఏడాది చివరిలో అయినా, లేదంటే వచ్చే సంక్రాంతి బరిలో అయినా నిలిచే అవకాశం ఉంది. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సహంగా ఉన్నారు. కానీ కెజిఎఫ్ టీజర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందంపై నీళ్లు చల్లింది. కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎన్టీఆర్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. మంచి డైరెక్టర్ ని వదులుకున్నాడంటూ అభినులు గుర్రుగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా అనగానే ఎన్టీఆర్ ఫాన్స్ సంతోషపడ్డారు.
కానీ ఏమైందో ఏమో ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబో ఫిక్స్ అయ్యింది. సరేలే అనుకుంటే ఇప్పుడు కెజిఎఫ్ లో హీరో ఎలివేషన్, ఆ మాసిజం చూసాక అయ్యో మంచి మాస్ డైరెక్టర్ ని తారక్ మిస్ చేసుకున్నాడే.. RRR తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసినా.. మళ్లీ ప్రశాంత్ నీల్ తో అదిరిపోయే పాన్ ఇండియా ఫిలిం పడేది. చేజేతులా తారక్ ఆ ఛాన్స్ వదులుకున్నాడని తెగ ఫీలైపోతున్నారు. ట్విట్టర్ లో మైత్రి మూవీస్ వారు - ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ల సంభాషణతో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్ అని సంబరపడే లోపు ప్రభాస్ లైన్ లోకొచ్చాడు. మరి ఓ స్టార్ హీరోని ఓ రేంజ్ మాస్ హీరోగా చూపించాలంటే ప్రశాంత్ నీలే అంటూ కెజిఎఫ్ 2 టీజర్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఫీలవుతున్నారు. అదే గనక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనుకుంటే అది పాన్ ఇండియా రేంజ్ ఫిలిం రికార్డులను తుడిచేవి అంటూ ఎన్టీఆర్ అభిమానులు తెగ ఇదైపోతున్నారు.