Advertisementt

నీహారిక నీ స్పీడ్ కి చెప్పాలి జోహారిక

Fri 08th Jan 2021 04:45 PM
niharika konidela,niahrika,mega daughter,new web series,niharika web series,nikhil vijayendra,niharika konidela new web series launch  నీహారిక నీ స్పీడ్ కి చెప్పాలి జోహారిక
Niharika new web series launch నీహారిక నీ స్పీడ్ కి చెప్పాలి జోహారిక
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక గ్రాండ్ గా పెళ్లి చేసుకుని హాని మూన్ కుడా వెళ్ళొచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఆ ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటూ హడావిడిగా ఉంటుంది. అయితే పెద్దింటి కోడలిగా వెళ్లిన నిహారిక ఇక మొహానికి మేకప్ వేసుకునే అవకాశాలు లేవనే అనుకున్నారు. గృహిణిగా మారిపోతుంది అనుకున్నారు కూడా. కానీ కొణిదెల వారి కొత్త పెళ్లి కూతురు పెద్ద పెద్ద హీరోయిన్స్ లాగా పెళ్లి చేసుకున్న వెంటనే పనిలోకి దిగిపోయింది. నిన్నమొన్నటివరకు హీరోయిన్ అవకాశాలు కోసం ఎదురు చూసిన నిహారిక కొన్నాళ్లుగా వెబ్ సీరియస్ చేసుకుంటుంది. 

నిహారిక ఇప్పుడు కొత్తగా మరో వెబ్ సీరీస్ లో నటించబోతుంది. తన భర్త చైతన్యతో కలిసి ఆ వెబ్ సీరీస్ ఓపెనింగ్ లో పాల్గొంది నిహారిక. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై నిఖిల్‌ విజయేంద్ర - నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో వెబ్‌ సిరీస్‌ ప్రారంభం అయ్యింది. హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ వెబ్ సీరీస్ లో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ రోజు ఆ వెబ్ సీరీస్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు టీం. మరి నిహారిక మాత్రం పెళ్లి, హాని మూన్ తో కొద్దిపాటి విరామం తీసుకున్నా మళ్ళి తనకు నచ్చిన తాను మెచ్చిన పనిలోకి దిగిపోయింది. మెగా డాటర్ పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరం కాదని ఈ వెబ్ సీరిస్ తో నిరూపించబోతుంది.

Niharika new web series launch:

Nikhil Vijayendra - Niharika Konidela new web series launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ