బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ లో ఎలా అయితే స్కిన్ షో చేసి ఆకట్టుకుందో.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ షో జేడ్జ్ గాను అదే విధంగా స్కిన్ షో చేస్తుంది. బిగ్ బాస్ ని మించి గ్లామర్ ప్రదర్శనతో మోనాల్ గజ్జర్ అందాల ఆరబోత ఉంది. అయితే బిగ్ బాస్ లో అటు గ్లామర్ పరంగాను ఇటు లవ్ ట్రాక్స్ పరంగాను హైలెట్ అయిన మోనాల్ బిగ్ బాస్ పై సంచలనంగా మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే బిగ్ బాస్ లో తానేమి పెద్దగా గ్లామర్ షో చెయ్యలేదు అని అర్ధం వచ్చేలా మాట్లాడింది. బిగ్ బాస్ ముందే కండిషన్ పెట్టారట. అదేమిటంటే చిన్న చిన్న డ్రెస్సులు, పొట్టి నిక్కర్లు వేసుకుని గ్లామర్ గా కనిపించమని కానీ మోనాల్ దానికి ఒప్పుకోలేదట. చిన్న చిన్న నిక్కర్లతో స్కిన్ షో చెయ్యను అని చెప్పిందట.
అయితే మోనాల్ వద్దనగానే ఆ స్కిన్ షో బాధ్యతను మరో కంటెస్టెంట్ హారిక తీసుకుందట. మోనాల్ ని గ్లామర్ డ్రెస్సులు వేసుకోమంటే కుదరదని చెప్పడంతో.. ఆ రకమైన డ్రెస్సులని వేసుకోమని బిగ్ బాస్ చెప్పాడని హారిక అలాంటి పొట్టి డ్రెస్సులతో బిగ్ బాస్ హౌస్ లో కనిపించింది అంటూ పెద్ద సీక్రెట్ ని మోనాల్ బయట పెట్టింది. మరి బిగ్ బాస్ కావాలనే హౌస్ లోకి వచ్చే అమ్మాయిలని ఇలాంటి గ్లామర్ షో చెయ్యమని, చిన్న చిన్న బట్టలు వేసుకోమని చెప్పడం కరెస్ట్ అన్నమాట. గతంలో శ్రీ రెడ్డి లాంటివాళ్లు బిగ్ బాస్ షో పై చాలా హాట్ కామెంట్స్ చేసినా ప్రస్తుతం బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ బిగ్ బాస్ పై ఇలాంటి కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.