జనవరి 9 సింగర్ సునీత జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం కాబోతుంది. యూట్యూబ్ ఓనర్ రామ్ వీరపనేని ని సింగర్ సునీత వివాహం చేసుకుంది. ఇరు పెద్దల అంగీకారంతో జనవరి 9 రాత్రి సునీత - రామ్ ల వివాహం ఓ గుడిలో కొద్దిమంది సన్నిహితుల మధ్యన జరిగింది. పెళ్లి సింపులే కానీ. సునీత పెళ్లి హంగామా అంటే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్న్ మాత్రం ఓ రేంజ్ లో జరిగాయి. పెళ్లి అని సునీత తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయట పెట్టినప్పటినుండి సునీత - రామ్ ల ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా హైదరాబాద్ లోని హోటల్స్ లో అందరూ మాట్లాడుకునేలా.. అంటే చాలా గొప్పగా జరిగాయి. మూడు షాపింగ్స్ ఆరు పార్టీలు అన్న రేంజ్ లో అన్నమాట.
ఇక శనివారం సోషల్ మీడియాలో సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సునీత మెహిందీ వేడుకలు, ఆమె హల్దీ సెరిమొని ఫొటోస్ వైరల్ అయ్యాయి. తన పిల్లలే తన పెళ్లి చేస్తున్న ఈ ఆనంద క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోయేలా సునీత మెహిందీ వేడుకలు సునీత కళ్ళలో ఆనందం ఆ ఫొటోస్ లో కనిపించింది.. ఇక సునీతకి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమ, రేణు దేశాయ్, అలాగే అనిత చౌదరి వంటి వారు సునీత వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయినప్పటినుండి అంటే సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీల దగ్గరనుండి.. ఇప్పుడు సునీత పెళ్లి వరకు అన్ని సందర్భాలలో వాళ్ళ హడావిడి కనబడింది. ప్రస్తుతం సునీత మెహిందీ వేడుకల ఫొటోస్, అలాగే తన పిల్లలతో సునీత ఆనందక్షణాలప్పుడు క్లిక్ మనిపించిన పిక్స్, తన పిల్లలతో సునీత ఆనందంగా గడుపుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.