పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులలోకి వెళ్ళింది. జనవారికి 14 న సంక్రాంతి రోజున పవన్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ టీజర్ కోసం పవన్ ఫాన్స్ వెర్రెత్తిపోయి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో లాయర్ సాబ్ గా కనిపించనున్న పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాల ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఫాన్స్ పండగ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అంటూ పవన్ ఫాన్స్ ఫిక్స్ అయ్యారు కూడా. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ శృతి విషయంలో పవన్ ఫాన్స్ లో ఆందోళన మొదలైంది.
ఎందుకంటే శృతి హాసన్ కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రవితేజ క్రాక్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రవితేజ తో ఎనర్జిటిక్ గా, గ్లామర్ గా శృతి హాసన్ ఉంటుంది అనుకుంటే క్రాక్ లో శృతి హాసన్ లుక్స్ మీద నెగెటివ్ కామెంట్స్ రావడమే కాదు.. సోషల్ మీడియాలో శృతి హాసన్ పై మీమ్స్ కూడా మొదలవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో ఆందోళన మొదలైంది. పవన్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్, వైఫ్ పాత్రలో నటిస్తుంది. అందులోను ఓ డ్యూయెట్ కూడా ఉంది. సో శృతి హాసన్ వలన పవన్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు. అయితే శృతి హాసన్ ఎంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉన్నా.. శృతి ది జస్ట్ గెస్ట్ రోల్ అంట.
తాను వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్టుగా శృతినే చెప్పింది. నేను చాలా తక్కువ టైం కనిపిస్తాను, నేనేమి హీరోయిన్ అని చెప్పలేదు. అయితే నేను కాసేపైనా నా పాత్ర చాలా బావుంటుంది. నా పాత్రని తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. అసలు పవన్ తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చిన వదులుకోను. అందుకే ఈ చిన్న అవకాశం కూడా వదులుకోలేదంటూ తాను వకీల్ సాబ్ లో ఎంత సేపు ఉండబోతుందో క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హమ్మయ్య జస్ట్ గెస్ట్ రోల్ కదా ఎక్కువగా ఆందోళన పడక్కర్లేదు అని సర్దుకుపోతున్నారు.