కవ్వించే భామ కంచె తెంచుకోగలదా

Tue 12th Jan 2021 05:45 PM
pragya jaiswal,pragya jaiswal pics,pragya jaiswal glamour show,pragya jaiswal news,pragya jaiswal movies,namo venkateshaya,kanche,naksahtram,jaya janaki nayaka,bb3,boyapati,balakrishna  కవ్వించే భామ కంచె తెంచుకోగలదా
Can the tempting Heroine cut the fence కవ్వించే భామ కంచె తెంచుకోగలదా

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన  కంచె సినిమాలో సీత కేరెక్టర్ చేసి సీతాకోక చిలుకలా తన వన్నెలన్ని, హొయలన్ని ఒలికించిన ప్రగ్యా జైస్వాల్ మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి ఆఫర్స్ నీ దక్కించుకోగలిగింది. ప్రఖ్యాత దర్శకుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఓం నమో  వెంకటేశాయ కానీ, క్రియేటివ్  డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం కానీ, మాంచి కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి తీసిన జయజనకి నాయక కానీ ఇవేమి ప్రగ్యా జైస్వాల్ కి ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అయితే సినిమాల వరకు హీరోయిన్ గా వెనుకబడినా ఒక హాప్పీనింగ్ డైరెక్టర్ తో ఎఫ్ఫైర్ విషయంలో మాత్రం ప్రగ్య జైస్వాల్ పేరు గట్టిగా వినిపించింది.

అది ఆ డైరెక్టర్ పెళ్లి.. విడాకుల వరకు వెళ్లెవరకూ వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి.. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో ఆ డైరెక్టర్ కూడా ప్రగ్య జైస్వాల్ ని దూరం పెట్టేసాడు. కానీ ప్రగ్యా  జైస్వాల్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే తన తాపత్రయం, తపనని ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్ ద్వారా వ్యక్తం చేస్తూనే వస్తుంది. సోషల్ మీడియా లో గ్లామర్ ఫొటోస్  పోస్ట్ చేస్తూ కొంచెం కొంచెంగా గ్లామర్ పెంచుతూ ఆఫర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. ప్రస్తుతం బోయపాటి - బాలయ్య BB3 లో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. మరి తన మీదున్న ఈ రిమార్క్ ని దాటుకుని ఆ కంచె ని తెంచుకుని ప్రగ్యా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలబడగలదా.. నిలబడగలదనే ఆశిద్దాం. ముఖ్యంగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ప్రగ్య జైస్వాల్ కి ఆల్ ద బెస్ట్ చెబుదాం. 

Can the tempting Heroine cut the fence:

Pragya Jaiswal Glamour Show