తెలుగు తెరకు మాళవిక శర్మ అందాలు కొత్తేమి కాదు. రవితేజ నేల టికెట్ సినిమాతోనే టాలీవుడ్ కి గ్లామర్ గర్ల్ లా పరిచయమైన రెడ్ హాట్ బేబీ మాళవిక కి ఇంకా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాళవిక శర్మ రెడ్ లో నటించింది. రామ్ రెడ్ లో వన్ అఫ్ ద హీరోయిన్ గా గ్లామర్ షో చేసిన ఈభామ రెడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ ని తెగ పొగిడేసింది. టాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్న సమంత నటన తనకి బాగా నచ్చుతుంది అని.. సామ్ యాక్టింగ్ బావుంటుంది అని చెప్పింది మాళవిక.
ఇక ఎటువంటి మేకప్ లేకుండా చాలా సహజంగా స్క్రీన్ మీద కనిపించడానికి గట్స్ ఉండాలి. ఆ గట్స్ సాయి పల్లవిలో ఉన్నాయంటుంది. సాయి పల్లవి తన స్కిన్ తో చాలా కంఫర్ట్ గా సినిమాల్లో నటించగలుగుతుంది అని అలాంటి గట్స్ ఏ హీరోయిన్ కి ఉండవని.. అలాంటి గట్స్ అసలు ఏ హీరోయిన్ కి రావని.. అందుకే సాయి పల్లవి అంటే తనకి చాలా ఇష్టం అంటూ సమంత, సాయి పల్లవిలను పొగిడేస్తోంది. మరి హీరోయిన్స్ నే కాదు.. అల్లు అర్జున్ కి తాని వీరాభిమానిగా చెప్పుకుంటుంది ఈ రెడ్ భామ. మరి అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల్లో అయినా ఈ గ్లామర్ గర్ల్ మీద కన్నేస్తాడేమో చూడాలి.