Advertisementt

క్రాక్ ముందు తెల్లబోయిన మాస్టర్!

Thu 14th Jan 2021 02:58 PM
vijay master,raviteja krack,krack movie,master movie,vijay,raviteja  క్రాక్ ముందు తెల్లబోయిన మాస్టర్!
Vijay Matser vs Ravi teja Krack క్రాక్ ముందు తెల్లబోయిన మాస్టర్!
Advertisement
Ads by CJ

విజయ్ - విజయ్ సేతుపత్రి కాంబోలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ కోలీవుడ్ లోనే కాదు. పలు భషాల్లో విడుదలైంది. పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ ప్రేక్షకులకు స్ట్రోక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ రిజెల్ట్ ఏ రివ్యూ ని కెలికిన కనిపిస్తుంది. జనవరి తొమ్మిదిన టాలీవుడ్ మాస్ రాజా రవితేజ క్రాక్ తో సూపర్ బోణి కొట్టాడు. థియేటర్స్ లో 50 పర్సెంట్ అక్యుపెన్సీతోనే దుమ్మురేగే కలెక్షన్స్ కొల్లగొడుతున్నది . మాస్టర్ వలన రవితేజకి ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే.. ఇప్పుడు మాస్టర్ థియేటర్స్ వైపు ప్రేక్షకులు వెళ్లేలా లేరు.

ఈ రోజు విడుదలవుతున్న రెడ్, అల్లుడు అదుర్స్  సినిమాల రిజెల్ట్ ని బట్టి క్రాక్ సినిమా కలెక్షన్స్ సేఫ్ అవుతాయా.. లేదా.. అనేది తెలుస్తుంది. మరి మాస్టర్ మాస్టర్ అంటూ ఏడాది నుండి అందరూ ఎదురు చూసినంత సేపు లేదు ఆ సినిమా ఎంత వీకో తెలియడానికి. విజయ్ హీరోయిజం, విజయ్ సేతుపతి విలనిజం తప్ప మాస్టర్ లో కనిపించిన మంచి సీన్ లేదంటే నమ్మాలి. లోకేష్ మీద భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్ ఫాన్స్ కూడా మాస్టర్ సినిమా విషయంలో ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. ఈ మాత్రం దానికా థియేటర్స్ థియేటర్స్ అన్నారు.. ఓటిటిలో వాడాల్సిన సినిమా ఇది అంటూ చాలామంది మాస్టర్ ని వెటకారం కూడా చేస్తున్నారు.

Vijay Matser vs Ravi teja Krack:

Vijay Matser vs Ravi teja Krack

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ