విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో ఫైటర్ గా తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ని కూడా విడుదల చేసింది టీం. బాక్సర్ గా విజయ్ మాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. విజయ్ - పూరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం ని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాస్వామిగా ఉండడంతో సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనాతో షూటింగ్ కి బ్రేకులు పడగా.. మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టె ముందు విజయ్ అభిమానులకు ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ట్రీట్ ఇచ్చింది టీం.
ఫైటర్ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకి లైగర్ అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. లైగర్ కి ఉప శీర్షికగా సాలా క్రాస్ బ్రీడ్ గా పెట్టారు. లైగర్ అంటే సింహం మరియు పులికి పుట్టిన సంకరజాతి జంతువు. అంటే ఊర మాస్ టైప్ అన్నమాట. పులి పూలె, సింహం సింహమే. రెండు కలిస్తే మాస్ కాదు ఊర మాస్ అవుతాది అన్నట్టుగా ఉంది విజయ్ దేవరకొండ బాక్సర్ లైగర్ లుక్. విజయ్ దేవరకొండ బాక్సర్ గా లాంగ్ హెయిర్ తో మాస్ గా కనబడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో పులి - సింహం ఫోటోలని చూపించారు. మరి విజయ్ ఇప్పుడు ఫైటర్ నుండి లైగర్ గా మారాడంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.