ఎప్పుడు స్లో గా సినిమాలు చేసే ప్రభాస్ ఇప్పుడు వరస సినిమాలతో పరిగెత్తిస్తున్నాడు. ఒకేసారి చేతిలో నాలుగు సినిమాలు. పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యాం షూటింగ్ ఫినిష్ అవుతుండగానే.. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ ఓపెనింగ్ చేసేసాడు. సంక్రాంతి పండగకి ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సలార్ పూజ కార్యక్రమాలతో మొదలైంది. అంతలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ లైన్ లోకొచ్చేసాడు. ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ మొదలైందని ఓం రౌత్ తన టీం తో సహా రంగంలోకి దిగినట్టుగా ఓ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అదే పిక్ ని ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. ఈరోజు ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ మొదలైంది.
వచ్చేనెల అంటే ఫిబ్రవరి 2న ఆదిపురుష్ ముహూర్తం అని తెలిపాడు ప్రభాస్. మరి ప్రభాస్ ఫాన్స్ లో అంతకంతకు టెంక్షన్ పెరిగిపోతుంది. ఎప్పుడూ రెండేళ్ళకి పైగా సినిమాని చక్కబెట్టే ప్రభాస్ కి ఒక్కసారిగా ఇంత ఊపొచ్చేసి సినిమాల మీద సినిమాల ఓపెనింగ్స్ చేసేస్తున్నాడు. మరోపక్క నాగ్ అశ్విన్ మూవీ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది అనే న్యూస్ కూడా వచ్చేస్తుంది. మరి ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలను ఎలా చక్కబెడతాడో.. అనే ఆతృతలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. ఎంతటెంక్షన్ పడుతున్నప్పటికీ.. ప్రభాస్ ఇచ్చే కొత్త సినిమాల అప్ డేట్స్ తో ప్రభాస్ ఫాన్స్ కి ఊపిరి ఆడడం లేదు. సలార్ ఓపెనింగ్ అయిన ఐదు రోజులకే అది పురుష అప్ డేట్.. ఆదిపురుష్ ఓపెనింగ్ అయిన కొద్దిరోజులకే నాగ్ అశ్విన్ అప్ డేట్ ఇచ్చినా షాకవ్వక్కర్లేదు అనుకుంటున్నారు ఫాన్స్.