Advertisementt

రేసు గుర్రం శృతిలా టెంక్షన్ పడుతుంటా..

Tue 19th Jan 2021 10:46 AM
samantha,shakunthalam,tamil movie,vignesh shivan,vijay sethupathi,sruthi haasan,nayanathara  రేసు గుర్రం శృతిలా టెంక్షన్ పడుతుంటా..
She was like Shruthi Hassan's character from Race Gurram రేసు గుర్రం శృతిలా టెంక్షన్ పడుతుంటా..
Advertisement
Ads by CJ

ఏమాయ చేసావే, బృందావనం సినిమాలతో ట్రెడిషనల్ గాను, గ్లామర్ గర్ల్ గాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఒకప్పుడు స్టార్ హీరోల సరసన కమర్షియల్ మూవీస్ లో అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎప్పుడూ గ్లామర్ డాల్ లా అందాలు ఆరబోసే సమంత పెళ్లి తర్వాత పాత్రకు ప్రాముఖ్యం ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. తొందరపాటు తనంతో కాకుండా అలోచించి నిర్ణయం తీసుకుంటుంది. పాత్రకి, కథకి ప్రాముఖ్యతనిచ్చే సమంత.. హాట్ నెస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. గ్లామర్ గానే తన కేరెక్టర్స్ కి లింక్ అయ్యే పాత్రలతో చెలరేగిపోతున్న సమంత ఇప్పటికి సినిమా సెట్స్ లో తెగ టెంక్షన్ పడుతుందట. కెరీర్ మొదలెట్టిపదేళ్లు గడుస్తున్నా సెట్స్ లో ఇప్పటికి తెలియని ఓ భయం వెంటాడుతూనే ఉంటుంది అంటూ చెబుతుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. సెట్ లో దర్శకుడు కానీ, కెమెరా మ్యాన్ కానీ ఏదైనా చెప్పగానే తనలోని టెంక్షన్ బాగా పెరిగిపోతుంది అని, కానీ ఆ టెంక్షన్ ఛాయలను ఎవరికీ తెలియనివ్వనని చెబుతుంది సమంత. అంటే రేసుగుర్రంలో శృతి హాసన్ బయటికి కనిపించకుండా భయపడడం, నవ్వడం, డాన్స్ చెయ్యడం లాగా తాను కూడా టెంక్షన్ లోపలే దాచుకుంటా అని చెబుతుంది సమంత. అలా ఎందుకు అంటే నేను సెట్స్ లోకి అడుగుపెట్టేముందు నాకేమి రాదు.. అంతా కొత్త అనుకుంటూ సెట్ లోకి అడుగుపెడతా. ఓ కొత్త నటిలా మారిపోయి ఆ పాత్రలోకి అడుగుపెడతాను. అప్పుడే ఆ పాత్రని నేను చాలా బాగా చేయగలుగుతాను. అందుకే ఆ టెంక్షన్ ని కూడా ఇష్టంగా ఫీలవుతుంటా అని చెబుతుంది సమంత. మరి ఇప్పుడు కమర్షియల్ మూవీస్ ని పక్కనబెట్టి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని ఒప్పుకుంటున్న సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, తమిళనాట విగ్నేష్ శివన్ సినిమాలోనూ నటిస్తుంది.

She was like Shruthi Hassan's character from Race Gurram:

Samantha had her feelings inside her like an emotionless girl

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ