పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం లైగర్ గురించి తాజా అప్ డేట్ ఏమిటి అంటే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. సాల క్రాస్ బ్రీడ్ లైగర్ గా విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండ అభిమానులైతే ఏకంగా విజయ్ లైగర్ ఫస్ట్ లుక్ కి బీరాభిషేకాలు, టాటూ లు వేయించేసుకుంటూ నానా రచ్చ చేస్తుంది. నిజంగా రౌడీ హీరో ఫాన్స్ రౌడీస్ లాగే రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా క్రైసిస్ వలన షూటింగ్ ఆగింది కానీ లేదంటే ఈపాటికి లైగర్ సినిమా ప్రేక్షకుల ముందు ఉండేది. భారీ బడ్జెట్ తో పూరి జగన్నాధ్ - ఛార్మి - కరణ్ జోహార్ లు కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అయితే ఇప్పుడు లైగర్ బడ్జెట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో లైగర్ మూవీ బడ్జెట్ ఏకంగా 125 కోట్ల పైమాటే అంట. పూరి కెరీర్ లోనే కాదు, విజయ్ దేవరకొండ కెరీర్ లోను ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. ఈ సినిమా కోసం ముంబై పరిసర ప్రాంతాలతో పాటుగా.. కొన్ని సెట్స్ అవసరపడుతున్నాయి. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ కోసం వేసిన బాక్సింగ్ సెట్ లో లైగర్ కొత్త షెడ్యూల్ ని పూరి మొదలు పెట్టబోతున్నాడు. విదేశీ ఫైటర్స్ తో ఈ క్లైమాక్స్ షూట్ ఉండబోతుంది అని, సినిమాకి ఈ క్లైమాక్స్ సన్నివేశాలే మేజర్ హైలెట్ గా నిలవబోతున్నాయని సమాచారం. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ జరుపుకున్న లైగర్ ఇక నుండి మొదలు కాబోయే షెడ్యూల్ కూడా భారీగాను అలాగే చిన్న గ్యాప్ అనేదే లేకుండా పూరి ప్లాన్ చేసి పెట్టుకున్నాడట. ఇక ఈ సినిమాలో విజయ్ ఫాదర్ గా, డాన్ గా సునీల్ శెట్టి నటిస్తుండగా.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.