బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఎవరు ఎలా బిజీ అయ్యారో తెలియదు కానీ.. గ్లామర్ బ్యూటీ, హాట్ బ్యూటీ మోనాల్ గజ్జర్ మాత్రం బాగా బిజీ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోనే తెగ పాపులర్ అయిన మోనాల్ బయటికి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. అందులోనూ గ్లామర్ గర్ల్ గానే దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ - అఖిల్ తో స్నేహం అంటూ దోబూచులాడింది ఈ చిన్నది. అభిజిత్ కన్నా ఎక్కువగా అఖిల్ తోనే స్నేహాన్ని కొనసాగించింది. అఖిల్ - మోనాల్ ప్రేమ జంటగా ప్రాజెక్ట్ అయ్యారు. బయటికి వచ్చాక కూడా మోనాల్ - అఖిల్ జంట ఎక్కడ కనబడినా బాగా పాపులర్ అయ్యింది.
ఈమధ్యన అఖిల్ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని అడిగిన మోనాల్ కి చిర్రెత్తుకొచ్చింది. అఖిల్ కి నాకు మధ్యన కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది. అఖిల్ ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో నాకెలా తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ మనసులో A అని ఉందనేది బిగ్ బాస్ హౌస్ లోనే బయటపడింది. A అంటే అభిజిత్ లేదా అఖిల్ అనుకున్నారు. కానీ మోనాల్ మనసులో ఉన్నది అభిజిత్ అండ్ అఖిల్ కాదు. మరొక A అంటే.. అతని పేరు ఆర్యన్. ఆ కథ ఏమిటంటే.. మోనాల్ తెలుగులో సుడిగాడు సినిమా చేసాక మళ్ళీ చానళ్లకు బిగ్ బాస్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది.
మధ్యలో మోనాల్ కి మలయాళంలో ఆఫర్ రాగా.. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ మలయాళం సినిమాలో నటిస్తున్నప్పుడే ఆ సినిమా హీరో ఆర్యన్ తో మోనాల్ డేటింగ్ చేసి.. అతనితో ఐదేళ్లు లవ్ జర్నీ కంటిన్యూ చేసిందట. అదే విషయాన్నీ మోనాల్ తాజాగా బయట పెట్టింది. ఐదేళ్ల డేటింగ్ చేసాక కొన్ని కారణాల వలన ఆర్యన్ తో బ్రేకప్ అయినట్లుగా చెప్పుకొచ్చింది. సో బిగ్ బాస్ హౌస్ నుండి A అనే లెటర్ మీద క్రియేట్ అయిన సస్పెన్స్ కాస్తా.. ఇప్పుడు ఇన్నాళ్ళకి మోనాల్ రివీల్ చేసేసి అందరికి క్లారిటీ ఇచ్చేసింది.