ఇక్కడంటే.. ఇక్కడేమిటి ? ఎక్కడైనా అంతే.. మనుషుల కంటే వారి విజయాలు, వారి డబ్బు మాట్లాడే సందర్భాలే ఎక్కువ ? ఎంతైనా మనిషి జీవితం కదా !! అలాగే ఉంటుంది. అంతా కమర్షియల్. ఇక సినిమా రంగంలో హిట్ లేదా ... నువ్వు ఎదురొస్తున్నా కూడా పక్కకు తప్పుకునే వాళ్లే తప్ప అయ్యో ఎందుకు ఏమిటి ? అని అడిగేవాడు ఎవ్వడు ఉండరు.. అదే హిట్ వచ్చిందా వెంటపడి మరి అవకాశాలు ఇస్తారు. నిజమే ఇక్కడ హిట్ ఒక్కటే మాట్లాడుతుంది. ఒక్క హిట్ తో ఎవరు గొప్పవాళ్ళై పోరు.. ఒక్క ప్లాప్ తో ఎవరు అదః పాతాళంలోకి వెళ్ళరు. అక్కడ జస్ట్ కొద్దీ టైం అంతే !! ఈ విషయం ఎందుకొచ్చిందటే.. సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలక్షన్స్ పరంగా కూడా మంచి జోరు చూపిస్తుంది. అందుకే ఈ సినిమా తీసిన దర్శకుడు అంటే ఇప్పుడు ఎంత క్రేజ్ వచ్చిందో.. కానీ క్రాక్ విడుదలకు ముందు ఆ దర్శకుడి పరిస్థితి వేరు ?
పిలిచి కాదు అడిగిన ఎవరు అవకాశాలు ఇచ్చిన పాపాన పోలేదు.. కానీ తాను నమ్మిన వ్యక్తిగా రవితేజ పిలిచి మరి అవకాశం ఇవ్వడం.. ఈ సారి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలన్న కసితో ఈ సినిమా చేసానని చెప్పాడు దర్శకుడు. అంతే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెత ను ఫాలో అయ్యాడేమో.. ఎక్కడ ప్లాప్ కొట్టిందో అక్కడే సూపర్ హిట్ కొట్టేసాడు. పైగా మాస్ సినిమాలు డీల్ చేసే దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఇంకేముంది.. యావత్ పరిశ్రమ అతనికి జై కొడుతోంది !! ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడ విన్నా గోపీచంద్ మలినేని పేరు తప్ప మరేమి వినిపించడం లేదు ? అంతెందుకు మెగాస్టార్ పిలిచి మరి అభినందించాడంటే ఆ సక్సెస్ రేంజ్ ఏమిటో అర్థం అవుతుంది !! మరి ఈ గ్యాప్ లో మెగాస్టార్ తనకోసం సినిమా అఫర్ కూడా ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది మరి !!