Advertisementt

ఏకే రీమేక్ కోసం క్రిష్ ని పక్కనబెట్టిన పవన్

Wed 20th Jan 2021 01:09 PM
pawan kalyan,ak remake,sekhar k chandra,krish movie,ak remake shooting  ఏకే రీమేక్ కోసం క్రిష్ ని పక్కనబెట్టిన పవన్
Pawan sidelines Krish for AK remake ఏకే రీమేక్ కోసం క్రిష్ ని పక్కనబెట్టిన పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం కాదు.. నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. అందులో రాజకీయాలు ఒక ఎత్తైతే.. ఆయన ఒప్పుకున్న సినిమాలు మరో ఎత్తు. ఒకటి తర్వాత ఒకటి కాకుండా.. వరసగా నాలుగు సినిమాలు. అందులో వకీల్ సాబ్ పూర్తయ్యింది. క్రిష్ సినిమా రెండు షెడ్యూల్స్ మినహా షూటింగ్ మొత్తం బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం క్రిష్ కోసం కేటాయించిన వారం రోజుల షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి క్రిష్ సినిమాకి బ్రేకిస్తున్నాడు. కారణం ఏకే రీమేక్. శేఖర్ కె చంద్ర తో ఏకే రీమేక్ కోసం ఓ 20 రోజుల పాటు క్రిష్ సినిమా నుండి బ్రేక్ తీసుకోబోతున్నాడట పవన్. రేవు 22 నుండి ఏకే రీమేక్ పట్టాలెక్కబోతుంది.

దాని కోసం పవన్ లుక్ టెస్ట్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే పవన్ లుక్ పై ఏకే రీమేక్ టీం ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ ఏకే రీమేక్ కోసం లుక్ లో చాలా చేంజెస్ చేస్తున్నాడట. అంటే చిన్న హెయిర్ కట్, అలాగే నెరిసిన గెడ్డంతో పవన్ లుక్ కాస్త రఫ్ గా కల్ట్ గా ఉండబోతుంది. మరి 20 రోజుల భారీ షెడ్యూల్ లోనే పవన్ ఏకే రీమేక్ ని పూర్తి చేసెయ్యబోతున్నాడట. రానా - పవన్ కాంబో సీన్స్ ని ముందుగా దర్శకుడు షూట్ చేస్తాడని.. ఈ సినిమాకి తక్కువ డేట్ కారణంగానే క్రిష్ సినిమాకి బ్రేకిచ్చేసి.. ఏకే రీమేక్ కోసం పవన్ తయారయ్యాడట. ఏకే రీమేక్ ఫినిష్ కాగానే పవన్ మళ్ళి క్రిష్ సినిమా కి రెడీ అవుతాడట. క్రిష్ సినిమాకి ఇప్పుడున్న నార్మల్ లుక్ లోనే పవన్ కంటిన్యూ అవుతున్నాడని సమాచారం.

Pawan sidelines Krish for AK remake:

Pawan Kalyan-Sekhar k Chandra AK Remake shooting schedule on January 22nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ