Advertisementt

ఆమెతో తన రాశి మారలేదంటున్న హీరో ?

Sat 23rd Jan 2021 05:32 PM
gopichand,maruthi movie,raashi khanna,action hero,seetimaarr movie  ఆమెతో తన రాశి మారలేదంటున్న హీరో ?
He says he can not act with her! ఆమెతో తన రాశి మారలేదంటున్న హీరో ?
Advertisement
Ads by CJ

ఆయన యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ అందుకున్నాడు.. కానీ తరువాత ఆ ఇమేజ్ ఎందుకు అనుకున్నాడో ఏమో.. వెంటనే ఫ్యామిలీ సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తూ.. ఆ జోనర్ లో రెండు మూడు సక్సెస్ లుకూడా అందుకున్నాడు .. కానీ ఈ మధ్య ఎందుకు తన కెరీర్ కు బ్రేకులు పడ్డాయన్న టెన్షన్ లో ఉన్నాడు. చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లుగా మిగిలాయి.. పోనీ కొత్త ప్రాజెక్ట్స్ చేయాలంటే ఏవి కుదరడం లేదు.. అందుకే ఈ సారి నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నాడు.. అందుకే అన్ని విషయాల్లో మరి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.. ఆ హీరో ఎవరన్నది మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా.. ఎస్ .. మీరు ఊహించిన ఆ హీరో గోపీచంద్ ? 

భారీ ఆశలతో చేసిన చాణిక్య డిజాస్టర్ కావడంతో గోపీచంద్ నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయన మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. మారుతీ కూడా వరుస పరాజయాల తరువాత ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ అందుకుని రిలాక్స్ అయ్యాడు. అందుకే మారుతితో సినిమా చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్న గోపీచంద్ ఈ సినిమా పై హోప్స్ కూడా పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ విషయంలోనే తేడాలొచ్చాయి. దానికి కారణం ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఎంపిక చేసాడు దర్శకుడు. ఎందుకంటే ఇంతకుముందే ప్రతి రోజు పండగ సినిమాతో హిట్ అందుకున్నారు ఇద్దరు కాబట్టి.. కానీ అసలు చిక్కు అక్కడే వచ్చింది.. ఆ హీరోయిన్ ని వద్దని చెప్పాడు గోపీచంద్ ? కారణం.. ఆమె పేరులో రాశి ఉన్నా కూడా తమ కాంబినేషన్ లో ఆ రాశి వాసి సరిగ్గా లేదని గోపీచంద్ ఫీలింగ్. దానికి రీజన్ కూడా ఉంది.. వీరిద్దరూ కలిసి నటించిన జిల్, ఆక్సిజన్ చిత్రాలు డిజాస్టర్లు .. అందుకే మరి ఏరి కోరి మూడో సినిమా కూడా చేస్తే ఎలా అనుకున్నాడో ఏమో.. నాకు రాశి .. వాసి కుదరలేదని అంటున్నాడు.. ! సో ఈ సినిమాలో రాసి ఖన్నాను కాకుండా మరో హీరోయిన్ కోసం దర్శకుడు అన్వేషణలో పడ్డాడు.

He says he can not act with her!:

Gopichand says he can not act with Raashi Khanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ