Advertisementt

అదిరింది అయ్యింది.. మరొకటి మొదలయ్యింది

Mon 08th Feb 2021 10:09 PM
comedy stars,jabardast show,sekhar master,sridevi,ashu reddy,ariyana,avinash,chammak chandra,bhargav sripada,star maa  అదిరింది అయ్యింది.. మరొకటి మొదలయ్యింది
Comedy Stars show in Star Maa అదిరింది అయ్యింది.. మరొకటి మొదలయ్యింది
Advertisement
Ads by CJ

జబర్దస్త్ ని కొట్టేద్దాం, చించేద్దాం అంటూ నాగబాబు జీ తెలుగులో భారీ లెవల్లో అదిరింది షో మొదలు పెట్టాడు. అదిరింది షో ఏ విధంగానూ జబర్దస్త్ ని కొట్టలేక చేతులెత్తేసింది. జబర్దస్త్ కామెడీ షో ని కొట్టాలంటే మాములు విషయం కాదనేది చాలా తొందరగానే అంటే ఏడాది తిరక్కుండానే అర్ధమైంది. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ కామెడీ చేసినా వర్కౌట్ అవవలేదు. జబర్దస్త్ లో సూపర్ క్రేజ్ ఉన్న చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు నాగబాబుని నమ్ముకుని అన్యాయం అయ్యిపోయారు. అదిరింది ఆగిపోవడంతో టాలెంటెడ్ కమెడియన్స్ రోడ్డున పడ్డారు. అయితే జీ తెలుగులో అదిరింది షో బెదిరిపోవడంతో ఇప్పడు స్టార్ మా లో మరో కామెడీ షోకి తెరలేపింది స్టార్ మా. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఏడాది పాటు వేరే షోస్ కి వెళ్లకుండా తన కోసం కట్టిపడేసుకున్న స్టార్ మా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే అదిరింది లో చేసిన చమ్మక్ చంద్ర, బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు జబర్దస్త్ కి నో ఎంట్రీ బోర్డు పెట్టిన అవినాష్, జోద్దర్ సుజాత, యూట్యూబ్ స్టార్ భార్గవ్ శ్రీపాద, అషు రెడ్డి, అరియనా గ్లోరీ ఇలా అందరిని ఓ చోటకి చేర్చి వారితో కామెడీ చేపించబోతుంది. ఈ షో కి జేడ్జ్ లు శేఖర్ మాస్టర్, మాజీ హీరోయిన్ శ్రీదేవి. ఇక యాంకర్స్ గా హాట్ గర్ల్ వర్షిణి, రవి లు ఉన్నారు. గ్లామర్ గర్ల్స్ లా అషు రెడ్డి, వర్షిణిలా గ్లామర్ ఈ షో కి అదనపు ఆకర్షణగా చూపించబోతున్నారు. స్టార్ మా లో వీరిదందరితో కామెడీ స్టార్స్ అనే షో ప్లాన్ చేసింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. జబర్దస్త్ ని పడేసే షో ఇంకా పుట్టలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు జబర్దస్త్ అభిమానులు.

Comedy Stars show in Star Maa:

Comedy Stars promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ