ఎక్కడైనా తండ్రి కూతుళ్ళకు మధ్య ఉన్న అనుబంధం చాలా స్పెషల్. తల్లి తో కన్నా తండ్రితోనే కూతురు ప్రేమగా, చనువుగా ఉంటుంది. తండ్రి కూడా కూతురిని ఫ్రెండ్ లా ప్రాణంలా చూసుకుంటాడు. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాక చిన్నపాటి గ్యాప్ రావడం అనేది సహజం. తాజాగా ఆ విషయమై మెగా హీరో నాగబాబు కాస్త ఫీలవుతున్నాడు. డిసెంబర్ లో తన కూతురు నిహారికాని చైతన్య వడ్లమూడి చేతిలో పెట్టి అంగరంగ వైభవంగా అప్పగింతలు చేసిన చాలా రోజులకి నాగబాబు కూతురు విషయమై స్పందించాడు. తనకి అమ్మాయిలంటే చాలా ఇష్టమని, అలాంటి తన జీవితంలోకి నిహారిక అడుగుపెట్టింది అని, నిహారికతో అన్ని షేర్ చేసుకుంటాను., మా ఉద్దరి మధ్యన మాటల్లో చెప్పలేని నుబంధం ఉంది. కానీ నిహారిక కి పెళ్లి అయ్యాక మా మధ్యన మాటలు కాస్త తగ్గాయి.. అంటున్నాడు నాగబాబు.
నిన్నమొన్నటి వరకు ఇంట్లోనే సందడి చేసిన నిహారిక ఇప్పుడు భర్త తో హనీమూన్, అత్తారిల్లు అంటూ కాస్త బిజీగా మారడంతో నిహారికతో నాగబాబు కి మధ్యన కాస్త దూరం అంటే మాటలకు అందనంత దూరం ఏర్పడింది. అదే విషయాన్నీ నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మా మధ్యన మాటలు కొద్దిగా తగ్గాయి. కానీ నిహారిక కొత్త జీవితానికి నాంది పలికినందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంటే.. ఆడ పిల్లలు పెళ్లయ్యాక ఇలాంటివి చాలా సహజం బాబుగారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు నిహారిక పెళ్లయ్యాక కెరీర్ కి గ్యాప్ ఇవ్వకుండా ఓ వెబ్ సీరీస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.