Advertisementt

కన్నీటి పర్యంతమైన నిహారిక

Mon 25th Jan 2021 10:05 AM
niharika,nagababu,nagababu daughter,niharika wedding,niharika emotional,bride,niharika weds chaitanya  కన్నీటి పర్యంతమైన నిహారిక
Tears welled up as the bride was getting ready కన్నీటి పర్యంతమైన నిహారిక
Advertisement
Ads by CJ

మెగా డాటర్ పెళ్లి కుదిరినప్పటినుండి ఆమె పంచుకున్న ఆనంద క్షణాలని చూసారు కానీ.. ఆమె కళ్లలో కన్నీరు ఎవరూ గుర్తించలేదు. ఆడపిల్ల పెళ్ళై అత్తారింటికి వెళ్లడం అనేది ఎంత సహజమో.. పుట్టింటి బంధాలకు దూరంగా వెళ్ళేటప్పుడు బాధని కన్నీళ్ల రూపంలో ఎక్సప్రెస్ చెయ్యడం అంతే సహజం. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి గత ఏడాది డిసెంబర్ లో మెగా ఫ్యామిలీ మధ్యన ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసాము. నిహారిక తనకు కాబోయే చైతన్యతో ఎంత అల్లరి చేసిందో పెళ్లి తర్వాత హాని మూన్ అంటూ అంతే రచ్చ చేసింది. మరి పెళ్ళిలో పెళ్లి కూతురుగా నిహారిక నవ్వుతూ మెరిసిపోయింది. ఆ నవ్వు వెనుక అంతే దుఃఖం ఉంది అనేది పెళ్లి విడియోలోనే తెలిసింది. నిహారిక పెళ్లి కూతురు అవుతూ కన్నీటి పర్యంతమైంది. పెళ్లి కూతురుగా రెడీ అవుతూనే కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు..పెళ్ళిలో తాళి కట్టించుకునేటప్పుడు అంతే భావోద్వేగానికి గురైంది.

కారణం ఒక్కటే తనకి పుట్టిల్లు ఎక్కడ దూరమవుతుందో అనే బాధ. తండ్రి నాగబాబుతో నిహారికకు ఉన్న ఎటాచ్మెంట్ అలాంటిది. రీసెంట్ గా నాగబాబు కూడా నిహారికతో పెళ్లి తర్వాత మాటలు తగ్గాయంటూ ఫీలయ్యాడు. అన్ని విషయాలను కూతురుతో షేర్ చేసుకునే నాగబాబు నిహారిక పెళ్లి తర్వాత అత్తారిల్లు, భర్తతో విదేశీ ట్రిప్స్ తో ఫ్యామిలీకి కాస్త దూరమైంది. దానితో నాగబాబు నిహారికతో మాటలు తగ్గాయంటూ బాధపడితే.. నిహారిక పెళ్లి కూతురుగా కన్నీళ్లు పెట్టుకుంది. భర్తతో ఏడడుగులు వేస్తున్న అనే సంతోషం, మరోపక్క తండ్రికి దూమవుతానేమో అనే బాధ.. నిహారిక మొహం లో స్పష్టంగా కనబడింది. నిహారిక పెళ్ళిలో చిరు, పవన్, వరుణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ కలిసి ఎంత సందడి చేసారో ఫొటోస్, వీడియోస్ లో చూస్తే.. నిహారిక కన్నీళ్లు మాత్రం ఆమె పెళ్లి ఫుల్ వీడియోలోనే కనిపించింది.  

Tears welled up as the bride was getting ready:

Emotions flood in Niharika's wedding  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ