ఈవీవీ సత్యన్నారాయణ కొడుకుల్లో ఆర్యన్ రాజేష్ ఎప్పుడో హీరో పాత్రలకి దూరమయ్యాడు. వినయ విధేయరామతో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను ఫెయిల్ అయ్యాడు. ఇక రెండో కొడుకు అల్లరి నరేష్ కామెడీ హీరోగా ఒకప్పుడు దుమ్మురేపేవాడు. అది ఈవీవీ ఉన్నప్పుడు అల్లరి నరేష్ సక్సెస్ లు చవి చూసాడు. కానీ గత కొన్నేళ్లుగా అల్లరి నరేష్ సినిమాలేవీ హిట్ అవ్వడం లేదు.. సరికదా కామెడిగాను ప్రేక్షకులను నరేష్ నవ్వించలేకపోతున్నాడు. హీరోలను అనుసరిస్తూ కామెడీ చేసే అల్లరి నరేష్ ఫేస్ చూస్తేనే అందరికి నవ్వు వచ్చేసేది. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ సినిమా రిలీజ్ అంటే ప్రేక్షకులు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు, ఆసక్తి లేకుండానే అల్లరి నరేష్ సినిమాలు థియేటర్స్ లో విడుదలై మాయమైపోతున్నాయి.
రీసెంట్ గా ఆ లిస్టు లోకి బంగారు బుల్లోడు చేరిపోయింది. గత శనివారం విడుదలైన బంగారు బుల్లోడు సినిమా చూసి ప్రేక్షకులు బేర్ మంటున్నారు. బంగారు బుల్లోడు సినిమాలో కథ ఉన్నా కథనం లేదు, అల్లరి నరేష్ కామెడీ లేదు.. సినిమా కి ఎందుకు వచ్చామా దేవుడా అన్నట్టుగా ఉన్నారు ప్రేక్షకులు. అల్లరి లో కామెడీ యాంగిల్ ని చూడలేకపోతున్నామంటున్నారు. కామెడీ చెయ్యలేక, హీరోయిజం చూపించలేక అల్లరి నరేష్ కూడా చేతులెత్తేస్తున్నాడు. అల్లరి నరేష్ లో కామెడీ యాంగిల్ చూపించేందుకు దర్శకులు చేసే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అందుకే ఇక హీరో పాత్రలకి అల్లరి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. మహర్షిలోలా ఏ హీరో ఫ్రెండ్ కేరెక్టర్ లేదంటే విలన్ కేరెక్టరో ట్రై చేసుకోమంటూ అల్లరికి ఉచిత సలహాలు పడేస్తున్నారు.