Advertisementt

RRR రీలీజ్ డేట్ వచ్చేసింది

Mon 25th Jan 2021 02:19 PM
jr ntr,rajamouli,ram charan,rrr movie,release on october 13,rrr date,dvv danayya,rrr movie release date,oct 13th 2021  RRR రీలీజ్ డేట్ వచ్చేసింది
RRR release date locked RRR రీలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

RRR బిగ్ అనౌన్సమెంట్ అంటూ ఈ రోజు ఉదయమే RRR టీం ఇచ్చిన ప్రకటనతో RRR అభిమానులు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం రాజమౌళి ఇవ్వబోయే బిగ్ అనౌన్సమెంట్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఇవ్వబోయే స్పెషల్ ట్రీట్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు క్షణం ఒక యుగం ల గడుపుతున్నారు. రాజమౌళి ఇవ్వబోయే ట్రీట్ ఏంటా అని అందరిలో ఆసక్తితో పాటు క్యూరియాసిటీ. మొన్నటికి మొన్న హాలీవుడ్ నటి RRR అక్టోబర్ 8 రిలీజ్ అంటూ ట్వీట్ చెయ్యడం, వెంటనే డిలేట్ చెయ్యడంతో.. ఇప్పుడు రిపబ్లిక్ డే రోజున RRR డేట్ ప్రకటిస్తారు అని అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.

జనవరి 25 మధ్యాన్నం  2 గంటలకు RRR టీం ఇచ్చిన మాట ప్రకారం RRR రిలీజ్ డేట్ రివీల్ చేసింది. కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ ట్రీట్  ఇచ్చేసింది. అది అక్టోబర్ 13 న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అంటూ రామరాజు, భీం లు గుర్రం, బైక్ పై దూసుకుపోతున్న పోస్టర్ తో రివీల్ చేసింది. ఆవేశంగా రామరాజు గుర్రాన్ని పరిగెత్తిస్తుంటే.. కొమరం భీం అంతే ఆవేశంతో బైక్ రైడ్ చేస్తూ RRR పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఫైర్ అండ్ వాటర్ వేవ్ మీరు ఎన్నడూ చూడని విధంగా కలిసి వస్తున్నారు మన భీం అండ్ రామరాజులు.

రౌద్రం - రణం - రుధిరం అంటూ రాజమౌళి ఇవ్వబోయే ఫీస్ట్ కోసం అక్టోబర్ 13 వరకు వెయిట్ చెయ్యాల్సిందే అంటూ RRR రిలీజ్ డేట్ పోస్టర్ తోనే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి రాజమౌళి ఇవ్వబోయే విజువల్ వండర్ కోసం వరల్డ్ వైడ్ ప్రేక్షకులు కూడా అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.

RRR release date locked:

Jr NTR and Ram Charan's RRR to release on October 13

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ