ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఉద్యోగులు - ప్రభ్యత్వం vs SEC నిమ్మగడ్డ ఫైట్ సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసారు. కానీ ఏపీ ఉద్యోగ సంఘాలు కరోనా కారణముగా మా ప్రాణాలు పోతాయి.. ఈ ఎన్నికలు వాయిదా వెయ్యండి లేదంటే విధులు బహిష్కరిస్తాం అంటూ నిమ్మగడ్డతో ఛాలెంజ్ చేసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ఎన్నికలు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం SEC పై సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఈ సోమవారం సుప్రీం కోర్టులో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై వాదోపవాదనలు తర్వాత సుప్రీం కోర్టు తన తీర్పుని వెలువరించింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుదరదని.. రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని.. ఎన్నికలు యదాతదంగా జరుపుకోవచ్చని తీర్పు నిచ్చింది. అసలు కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా ఏమిటి? అయినా ఉద్యోగులు పనులు చెయ్యకుండా ఇలాంటి పిటిషన్ వెయ్యడం ప్రమాదకరం.. అసలు SEC మీటింగ్ కి ఉద్యోగులు ఎందుకు హాజరు కాలేదు? రెండు వ్యవస్థలతో మధ్య ఉన్న విషయం మీకేం అవసరం? ఈ విషయంలో ఉద్యోగుల జోక్యం ఏమిటి అంటూ ఉద్యోగ సంఘాల కి కోర్టు మొట్టికాయలు వేసింది. ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటీషన్ ని సుప్రీం కోర్టు కొట్టి వెయ్యడంతో ఏపీ ప్రభుకిత్వంతో పాటుగా ఉద్యోగ సంఘాలు ఖంగు తిన్నాయి.