తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతో కనబడకుండా పోయిన శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తర్వాత పెళ్లి పెళ్లి అంటూ బ్రేకప్ చేసుకుని సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటించింది. అయితే శృతి హాసన్ రీసెంట్ లుక్స్ పై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్న తరుణంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభాస్ - నాగ శ్విన్ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపిక కాగా.. ఆదిపురుష్ లో ప్రభాస్ పాత్ర కి హీరోయిన్ వేటలో ఉంది ఆదిపురుష్ బృందం.
అయితే ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ మూవీ చేస్తున్న ప్రభాస్ కోసం సలార్ డైరెక్టర్ శృతి హాసన్ ని సంప్రదించబోతున్నారట. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. అయితే హీరోయిన్ కేరెక్టర్ కి అంతగా నిడివి లేకపోయినా.. హీరోయిన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుంది. అలాగే శృతి హాసన్ ఇంతవరకు అలాంటి పాత్ర టచ్ కూడా చెయ్యని కారణమగానే ప్రభాస్ - శృతి జోడి బావుంటుంది అని ప్రశాంత్ నీల్ ఆలోచనగా చెబుతుంటే.. మాకొద్దు ఈ ప్లాప్ హీరోయిన్ అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. చిన్న పాత్రైనా క్రేజీ హీరోయిన్ తో చేయించండి కానీ.. శృతి హాసన్ వద్దు అంటూ ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారట.