Advertisementt

పవన్ లుక్ లో స్పెషల్ ఏముంది

Mon 25th Jan 2021 09:21 PM
pawan kalyan,ak remake,rana,sekhar k chandra,pawan special look,look change,cop look  పవన్ లుక్ లో స్పెషల్ ఏముంది
What's so Special in Pawan's Look పవన్ లుక్ లో స్పెషల్ ఏముంది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఏపీ రాజకీయాలకి విరామం ఇచ్చి ఏకే రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వచ్చేసారు. తాజాగా మొదలైన ఏకే రీమేక్ లో రానా - పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు శేఖర్ కె చంద్ర. అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి భారీ మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్ ని పక్కాగా పట్టాలెక్కించారు దర్శకనిర్మాతలు. అయితే ప్రస్తుతం ఏకే రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ లుక్ లో ఎలాంటి మార్పులు జరగలేదని తెలుస్తుంది. ఏకే రీమేక్ కోసం పవన్ లుక్ చేంజ్ చెయ్యబోతున్నాడు. మలయాళంలో ఏకే సినిమాలో బిజ్జు మీనన్ లుక్ లాగా అంటే పోలీస్ లాగా.. చిన్న హెయిర్ కట్, నెరిసిన గెడ్డంతో పవన్ కొత్తగా కనిపిస్తాడు.. ప్రస్తుతం లుక్ టెస్ట్ జరుగుతుంది అంటూ ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి. 

కానీ పవన్ అలాంటి లుక్ చేంజ్ డెసిషన్ కానీ, లుక్ లో మార్పులు కానీ చెయ్యలేదని..  రీసెంట్ గా బయటికి వచ్చిన ఈ పిక్ ద్వారా అర్ధమవుతుంది. నిన్నటివరకు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ వెంటనే ఏకే రీమేక్ లో దిగిపోయి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నాడు. మరి పవన్ సినిమా మధ్యలో లుక్ మారుస్తాడా అంటే బిజూ మీనన్ అయ్యప్పన్ కోషియమ్ సినిమా మొత్తం ఒకే లుక్ లో కనిపించాడు. అలా పవన్ లుక్ లో ఎలాంటి చేంజెస్ అయితే కనిపించడం లేదు. అంటే మాములు కాప్ లుక్ లోనే కనిపిస్తాడని.. ఏకే రీమేక్ లో ఎలాంటి స్పెషల్ లుక్ పవన్ ట్రై చెయ్యడం లేదని ఈ పిక్ చూస్తే స్పష్టత వస్తుంది. 

What's so Special in Pawan's Look:

No change in Pawan Kalyan's look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ