బిగ్ బాస్ సీజన్ 3 తో క్రేజీ గా లైమ్ టైం లోకి వచ్చిన న్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నటి పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. దానితో పునర్నవి - రాహుల్ పెళ్లి చేసేసుకుంటారేమో అనుకున్నారు. బయటికి వచ్చాక కూడా పునర్నవితో రాహుల్ కొన్నాళ్ళు జతగానే తిరిగాడు. కానీ తర్వాత అషు రెడ్డి తో రాహుల్ హైలెట్ అవుతున్నాడు. సీజన్ 3 లో అషు రెడ్డి కూడా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అషు రెడ్డి తో రాహుల్ పెద్దగా కలవకపోయినా.. బయట మాత్రం రాహుల్ అషులు బాగా క్లోజ్ గా మూవీ అవుతున్నారు. ఈమధ్యన పబ్లిక్ గానే తిరుగుతున్నారు. హాగ్ లు ఇచ్చుకోవడం, అషు ని రాహుల్ ఎత్తుకోవడం అబ్బో వీళ్ళ యవ్వారం మాములుగా లేదు. దానితో రాహుల్ - అషు రెడ్డిల మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.
కానీ అవి రూమర్స్ కాదు నిజాలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బిహేవియర్. ఈమధ్యన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ - అషు రెడ్డిలు ఒకరి కోసం ఒకరు పాట పాడుకున్నారు. అంతేకాదు.. మేమిద్దరం కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాము అంటూ ఏదేదో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడడంతో రాహుల్ అషు రెడ్డితో బాగానే పులిహోర కలుపుతున్నాడని అర్ధమైపోతుంది. అంతే కాదు.. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తే ఇవెలా బయటికి వచ్చాయి.. అయినా ఈ ఫొటోస్ నథింగ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయ్ అంటూ మాట్లాడడం చూస్తే వీరి మధ్యన సం థింగ్ కాదు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది వ్యవహారం.