పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ప్రాణమిత్రుడు, ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. రాజకీయాల్లోకి వెళ్ళాక స్నేహితుడికి కాస్త దూరంగా ఉంటున్నారు కానీ.. లేదంటే పవన్ ఎక్కడ ఉండే అక్కడే త్రివిక్రమ్ ఉండేవారు. అంత మంచి దోస్తానా వాళ్ళ మధ్యలో ఉంది. అయితే ఎన్టీఆర్ సినిమాపై ఉండాల్సిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లో హడావిడి చేస్తున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా మొదలు కావాల్సి ఉండగా.. దానిని పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగాడు. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ని ఒప్పుకోవడానికి కారణం త్రివిక్రమే. త్రివిక్రమ్ హ్యాండ్ లోనే అయ్యప్పన్ కోషియమ్ పట్టాలెక్కింది.
అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు కూడా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ డే రోజున విడుదల చేసిన ఏకే రీమేక్ సెట్స్ వీడియో లో పవన్ వెన్నంటే త్రివిక్రమ్ ని చూసిన వారు పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ దర్శకుడు సాగర్ కే చంద్ర కన్నా గురుజీనే పవన్ పక్కన ఆ వీడియోలోను తెగ కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ శేఖర్ డమ్మీ.. అంతా త్రివిక్రమే అన్నట్టుగా ఉంది. వీడియో స్టార్ట్ అయ్యింది మొదలు అన్ని ఫ్రేమ్స్ లోను త్రివిక్రమే. పవన్ ఎంటర్ అయినదగ్గరనుంది పవన్ పక్కనే త్రివిక్రమ్ కనిపించారు. మరి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో కర్త కర్మ క్రియ అన్ని త్రివిక్రమే అన్నట్టుగా లేదూ.. మరోపక్క పవన్ ఫాన్స్ కి నచ్చేలాగే ఉండాలి అంటూ అయ్యప్పన్ ఒరిజినల్ లో ఉన్న లుక్ కూడా తీసుకోకుండా పవన్ ని యంగ్ పోలీస్ గానే చూపించబోతున్నారు త్రివిక్రమ్. అందుకే అనేది అంతా త్రివిక్రమ్ మాయలాజం అని.