ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ లిస్ట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ మూవీస్ లిస్ట్ ఉంది. అందుకే ప్రభాస్ కూడా సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ చెయ్యడానికి ప్రభాస్ కంకణం కట్టుకున్నాడు. రాధేశ్యామ్ అవ్వగానే ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ షెడ్యూల్ వేసుకోవలసి ఉంది. మధ్యలో ఆదిపురుష్, నాగ అశ్విన్ సినిమాలను ప్రభాస్ ఎలా ప్లాన్ చేసుకున్నాడో కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం తెగ టెంక్షన్ పడిపోతున్నారు. మూడు సినిమా షూటింగ్స్ ని ప్రభాస్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని. ఇక సలార్ డైరెక్టర్ కెజిఎఫ్ రిలీజ్ డేట్ ఇవ్వకుండానే ప్రభాస్ సినిమా ఓపెనింగ్ చేసి మరీ ప్రభాస్ ని కట్టిపడేసాడు. అయితే తాజాగా ప్రభాస్ - ప్రశాంత్ నీల్ షూటింగ్ ఎక్కడ మొదలు కాబోతుందో అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సలార్ ఫస్ట్ షెడ్యూల్ లో ఓపెన్ కాస్ట్ సింగరేణి బొగ్గు గనుల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసి పెట్టుకున్నాడట దర్శకుడు. తెలంగాణలోని రామగుండం, సింగరేణి ఓపెన్ కాస్ట్ నేపథ్యంలో షూటింగ్ చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారట. సింగరేణి ఓసీపీ-2 లో సలార్ లోని భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. సలార్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుంది అని ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు. సలార్ షూటింగుకి అవసరమైన విధంగా సింగరేణి బొగ్గు గనుల్లో సెట్స్ కూడా వేస్తున్నారట. ఫస్ట్ షెడ్యూల్ లో పది రోజుల పాటు సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరపడానికి టీం ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే సలార్ ఫస్ట్ షెడ్యూల్ డేట్ ని సలార్ టీం ప్రకటించబోతుందట.