జూలై 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ గని
ఆగష్టు 13 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో పుష్ప విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన మరో మెగా హీరో అల్లు అర్జున్
ఇక RRR తో అక్టోబర్ 13 న పాన్ ఇండియా లెవల్లో రాబోతున్నాడు రామ్ చరణ్
మెగాస్టార్ చిరు - కొరటాల కాంబోలో వస్తున్నా ఆచార్య డేట్ మే లో ఉండొచ్చనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మధ్యలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఉన్నప్పటికీ.. ఏకే రీమేక్ మాత్రం వినాయక చవితి పండగ స్పెషల్ గా సెప్టెంబర్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
మ్యూజిక్: తమన్.ఎస్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి