Advertisementt

శృతి హాసన్ పెళ్లిపై కమల్ హాట్ కామెంట్స్

Thu 28th Jan 2021 03:19 PM
kamal haasan,shruti haaan,akshara haasan,sruthi wedding,boy friend,salaar heroine shruthi haasan  శృతి హాసన్ పెళ్లిపై కమల్ హాట్ కామెంట్స్
Kamal hot comments on Shruti Haasan wedding శృతి హాసన్ పెళ్లిపై కమల్ హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ తన మొదటి భార్యతో విడిపోయినా కూతుళ్ళు శృతి హాసన్, అక్షర హాసన్ లతో ఎప్పుడూ క్లోజ్ గానే ఉంటారు. ఇక శృతి హాసన్, అక్షర హాసన్ లు స్టార్ కిడ్స్ అయినా కమల్ హాసన్ పేరుని వాడుకోకుండా స్వశక్తితో పైకి ఎదిగారు. అయితే నేడు శృతి హాసన్ పుట్టిన రోజు స్పెషల్ ఏమిటి అంటే ఆమె సలార్ లో ప్రభాస్ కి జోడిగా ఎంపిక కావడం. మరోపక్క నటనలో మెళుకువలు నేర్పడం కానీ, అలాగే వాళ్ళ నటనలో ఎలాంటి వంకలు పెట్టడం కానీ చెయ్యాను అంటున్నారు కమల్ హాసన్. నాకు నేనుగా వాళ్ళకి సలహాలు ఇవ్వను, వాళ్ళు అడిగితె మాత్రం నటనలో మెళుకువలు నేర్పిస్తాను అని అంటున్నారు.

నా కూతుళ్ళని సైంట్యిస్టులు గా చేద్దామనుకున్నా.. కానీ వాళ్ళు నటనను ఎంచుకోవడంతో వాళ్ళ అభిప్రాయానికి స్వేచ్ఛనిచ్చాను అని.. ఇక తన కూతురు శృతి హాసన్ ప్రేమించి పెళ్లాడుతాను, నేను ఫలానా అతన్ని లవ్ చేశా డాడీ అని చెబితే నేనేమి అడ్డం పడను. అది వాళ్ళ ఇష్టం. భవిష్యత్తులో ఎలా ఉండాలో నా కూతుళ్ళకి సరైన అవహగానా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే హ్యాపీ గా ఫీలవుతాను. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నేను సంతోషిస్తా అంటూ కూతుళ్లు శృతి, అక్షయ పెళ్లిళ్లపై కమల్ హాట్ కామెంట్స్ చేసారు. ఇక శృతి హాసన్ కి శృతి అని పేరు పెట్టినందుకు ఆమె ఏడేళ్ల నుండే మ్యూజిక్ నేర్చుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు కూడా చేసింది అంటూ తన కూతురు శృతి గురించి కమల్ గర్వంగా మట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

Kamal hot comments on Shruti Haasan wedding:

Kamal haasan makes nteresting comments about his daughter Shruti haasan marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ