Advertisementt

రౌడీ స్టార్ నుండి గిఫ్ట్ అందుకున్న కరణ్ జోహార్

Thu 28th Jan 2021 09:23 PM
vijay deverakonda,rowdy hero,allu arjun,rowdy brands,spcial gift,karan johar,bollywood producer,vijay special gift  రౌడీ స్టార్ నుండి గిఫ్ట్ అందుకున్న కరణ్ జోహార్
Rowdy’s Special Gift To Karan Johar రౌడీ స్టార్ నుండి గిఫ్ట్ అందుకున్న కరణ్ జోహార్
Advertisement
Ads by CJ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలతోనే క్రేజీ హీరోగా మారలేదు.. రౌడీ బ్రాండ్స్ తోనూ యూత్ పల్స్ పట్టుకుని రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. రౌడీ హీరో ఫాన్స్ కూడా విజయ్ దేవరకొండని ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. అయితే వరస సినిమాలతో క్రేజీ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్స్ తో అల్లు అర్జున్ మనసు దోచుకున్నాడు. టాలీవుడ్ యూత్ ఐకాన్, డెస్సింగ్ స్టయిల్ లో ముందుండే ఆలు అర్జున్, విజయ్ నీ రౌడీ బ్రాండ్స్ కి ఫిదా అనగానే అల్లు అర్జున్ ఇంటికి రౌడీ బ్రాండ్స్ దుస్తులు గిఫ్ట్ వచ్చేసింది. విజయ్ దేరవకొండ పంపిన రౌడీ దుస్తులతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో హంగామా చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు నచ్చిన వారికీ ఇలాంటి గిఫ్ట్స్ తో సర్ప్రైజెస్ ఇస్తుంటాడు విజయ్.

తాజాగా బాలీవుడ్ బడా నిర్మాతకు విజయ్ దేవరకొండ పంపిన  గిఫ్ట్ ఒకటి సాంఘీక మద్యమాల్లో వైరల్ అయ్యింది. లైగర్ నిర్మాత కరణ్ జోహార్ కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా డెనిమ్ జాకెట్ ఒకదాన్ని డిజైన్ చేయించి గిఫ్ట్ గా పంపించాడు. ఆ డెనిమ్ జాకెట్ చూసిన కరణ్ ఎంతో ముచ్చటగా అందరికి చూపించేసేసాడు. సోషల్ మీడియా వేదికగా రౌడీ హీరో తనకు పంపిన డెనిమ్ జాకెట్ ని చూపించిన కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ కి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. మరి బాలీవుడ్ లో ప్రత్యేక స్టైలింగ్ కలిగిన కరణ్ జోహార్ మనసును రౌడీ స్టార్ తన రౌడీ బ్రాండ్స్ తో దోచేసాడంటే మాములు విషయం కాదు.

Rowdy’s Special Gift To Karan Johar:

Karan Johar Thanks Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ