నిన్నటినుండి ప్రేక్షకుల చూపంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే ఉంది. కేవలం ప్రేక్షకులేనా.. ఇతర భాషా ఇండస్ట్రీల ప్రముఖుల చూపు టాలీవుడ్ వైపే ఉంది. కారణం ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తుందో అని. కరోనా తో ఓ కేలెండర్ వెస్ట్ అయినా.. మళ్ళీ అంతా సాధారణ స్థితికి రావడంతో ప్రతి ఒక్క హీరో తమ సినిమాల విడుదల డేట్స్ ని ప్రకటిస్తున్నారు. గత ఏడాది థియేటర్స్ బంద్ తో సినిమాలన్ని వాయిదాల మీద వాయిదాలు పడితే.. ఈ ఏడాది మాత్రం వారానికో సినిమా చొప్పున థియేటర్స్ లో దిగుతున్నాయి. ఇక నిన్న అంటే జనవరి 28 న బోలెడన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసి పోస్టర్స్ వదిలాయి. పుష్ప ఆగష్టు 13 న అనగానే వరుణ్ తేజ్ గని జులై 30 అన్నాడు. అలాగే గోపీచంద్ సీటిమార్, F3 డేట్స్ కూడా వచ్చేసాయి. మరి అంత హడావిడిగా ఒకే రోజు అన్ని సినిమాలు డేట్స్ ఏమో కానీ.. ఆ రిలీజ్ డేట్స్ జాతర నెక్స్ట్ డే అంటే ఈ రోజు జనవరి 29 కూడా కంటిన్యూ అవుతుంది.
ఈరోజు స్పెషల్స్ ఏమిటి అంటే మహేష్ నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాని జులై 2 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా ఫస్ట్ లుక్ వదిలింది టీం. అంతేకాకుండా యాంకర్ గా అదరగొట్టిన ప్రదీప్ మార్చిరాజు హీరోగా వెండితెరకు లాంచ్ అయిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఈ రోజే విడుదలయ్యింది. అసలు ఈ రోజు మరింత స్పెషల్స్ ఏమిటి అంటే చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో కొరటాల తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆచార్య టీజర్ సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేస్తుంది టీం. అలాగే కెజిఎఫ్ తో అందరి అంచనాలను తారుమారు చేసిన కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చెయ్యబోతున్నట్టుగా కెజిఎఫ్ టీం ప్రకటించింది. ఇంకో స్పెషల్ ఏమిటంటే RRR టీం నుండి హాలీవుడ్ నటి, ఎన్టీఆర్ జోడి జెన్నిఫర్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది.
అంతేకాకుండా శర్వానంద్ - సిద్దార్థ్ కాంబోలో తెరకెక్కుతున్న అజయ్ భూపతి సెకండ్ ఫిలిం మహాసముద్రం ఆగష్టు 19th అంటూ డేట్ లాక్ చేసింది. ఇక అవికాకుండా మధ్యలో మరెన్ని విశేషాలు వింతలూ జరుగుతాయో అంటూ ప్రేక్షకులంతా సోషల్ మీడియా వైపే చేస్తున్నారు.